Geography, asked by ExStarVo, 1 year ago

Kissan essay in telgu fast

Answers

Answered by brainlystargirl
3
Heya ______

Answer __________

రైతుల్లోనాలుగో వంతు రైతులు కౌలుదారులున్నారు.వారి సంఖ్య ఇంకా ఎక్కువనేది బ్యాంకర్ల భావనమహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకునే భూముల కౌలుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు కు ఇచ్చేవారు, తీసుకునే వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు.స్వయం సహాయక సంఘాల్లో భూమి లేని నిరుపేద మహిళలు ఉమ్మడిగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వ్యవసాయ భూముల ఒప్పందాలు రాత పూర్వకంగా చేసుకోవాలి. కౌలు కాలపరిమితి కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. భూమిపైన పంట రుణం తీసుకునే అర్హత కౌలుదారుకు కలుగుతుంది. పంటలు దెబ్బతిన్న సందర్భంలో పంటల బీమాయేగాక ప్రభుత్వం ఇచ్చే పరిహారం పొందడానికీ అవకాశముంటుంది. అయితే భూమిపై ఎలాంటి హక్కు ఉండదు. కౌలు సమయంలో భూమి అభివృద్ధిపై పెట్టిన మొత్తాన్ని కోరేహక్కు కౌలుదారుకు ఉండదు. వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వడం, తీసుకోవడం సహజంగా నోటిమాటగా సాగుతుంది. దీనివల్ల తరచుగా కౌలుదారు మారిపోతాడు. భూ యజమాని ఇష్టమే ఇక్కడ ప్రధానం. కౌలుదారు భూమి అభివృద్ధికి పెట్టుబడి పెట్టినా మరుసటి సంవత్సరం అతని పేరుపైన కౌలు ఉంటుందన్న నమ్మకం ఉండదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. కౌలుదారులకు సంస్థాగత రుణాలు, పంటల బీమా తదితర సదుపాయాలను కల్పించేందుకు కౌలు చట్టాలను సవరించటమే తరుణోపాయం. భూమి యజమాని హక్కులకు ఎలాంటి విఘాతం కలగని రీతిలో రాష్ట్రాలు తమ కౌలు చట్టాల్లో మార్పులు తేవాలని 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నివేదిక స్పష్టం చేసింది.కౌలుచట్టాన్ని సవరించడమంటే భూముల యజమానుల హక్కులను వదులు కోవటం కానేకాదని, యాజమాన్య హక్కులు బదిలీ కాని రీతిలో తగిన భరోసాను ఇచ్చే సవరణలు రావాలని నివేదిక సూచించింది. కౌలు పరిమితి పూర్తి కాగానే భూమిని వెనక్కి తీసుకొనే అధికారం యజమానికి ఉండాలని, అన్ని వర్గాల వారూ భూమిని కౌలుకు తీసుకోగల వాతావరణం ఉండాలని సూచించింది.కౌలుదార్ల బృందాలకు స్వశక్తి సంఘాల మాదిరిగా పావలా వడ్డీకి రుణాలను ఇవ్వాలంది నాబార్డు.

రకరకాల కౌలు

పంజాబ్‌, హర్యానాల్లో పెద్ద, మధ్య తరహా రైతులు... చిన్న, సన్నకార రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొంటున్నారు. బాగా పెట్టుబడులు పెట్టి అధునిక పరికరాలతో ఉత్పాదకత పెంచుతున్నారు. కౌలుకిచ్చిన చిన్న సన్నకార రైతులు వేరే పనులు చేపట్టి ఎక్కువ ఆదాయాలు పొందుతున్నారు.

బీహార్‌, ఒడిషాలలో చిన్న, సన్నకార రైతులే తమ భూముల పక్కనుండే భూములను కౌలుకు తీసుకొని కమతాల పరిధిని పెంచుకొంటున్నారు. ఇక్కడ పెద్ద, మధ్య తరహా రైతులు పట్టణాలకు వలస వెళ్తున్నారు.

కేరళ, జమ్మూ కాశ్మీర్‌, మణిపూర్‌లలో కౌలుపై పూర్తిగా నిషేధం ఉంది.

గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్‌లలోకౌలుదారులు ఆయా భూములను కొనుగోలు చేసుకొనేందుకు అవకాశం లభిస్తోంది.

రాష్ట్రాలే తమ కౌలు చట్టాలను సవరించుకోవాలని కేంద్రం అంటోంది. వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం మాదిరిగా కౌలుదార్లపై ఒక ఆదర్శచట్టాన్ని తయారు చేసి పంపాలని మనరాష్ట్రం కేంద్రాన్ని కోరింది.

Thank you _____
Answered by Anonymous
2

your essay prepare well for exam

mark me as brainliest

Similar questions