kriya అనగా ఏమి? క్రియకు చెందిన 5 పదాలు rayandi
Answers
Answer:
Explanation:
ఏ భాషలోనైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల (nouns)ని విశేషణాల్ని (adjectives) రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.
===ధాతువులు===Dathumalu
తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి.
"చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు
ఉదా
కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.
అనుస్వార పూర్వకమైన (సున్నా ముందు గల)"చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.
ఉదా
దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.
ద్విరుక్త (వత్తు) "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు
ఉదా
తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.
"చు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.
ఉదా
నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి
"ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు.
ఉదా
గురించు (addressing), ఆకళించు (explain), సవరించు (amend), సవదరించు (edit) మొదలైనవి.
"ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియా ధాతువులు.
ఉదా
చేయించు ("చేయు" కు ప్రేరణార్థకం), కదిలించు ("కదులు" కు ప్రేరణార్థకం) మొదలైనవి.
"ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత)క్రియా ధాతువులు. (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి)
ఉదా
ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.
"యు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.
ఉదా
ఏయు, కాయు, కోయు, కూయు, డాయు, తీయు (తివియు), తోయు, మోయు, మ్రోయు, వేయు మొదలైనవి.
"యు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.
ఉదా
తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.
"ను" తో అంతమయ్యే క్రియాధాతువులు.
ఉదా
తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.
సామాన్య క్రియా ధాతువులు.
ఉదా
సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.
విశేష క్రియా ధాతువులు (special verbs).
ఉదా
ఉండు, పోవు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు మొదలైనవి.