India Languages, asked by ujj6udewnaNaz7ma, 1 year ago

Letter in telugu about 'Bala karmikulu'

Answers

Answered by kvnmurty
9
కెవిన్                                               25-09-2016
హైదరబాద్

అధ్యక్షా,
     
   మనదేశం లో ఇంకా లక్షలాది బాలకార్మికులున్నారంటే  ఈ విషయం గురించి మనం అందరం చాలాబాధ పడాలి.  ఎప్పుడో ఏభయి సంవత్సరాలక్రితం అంటే అనుకోవచ్చు.  కానీ ఇప్పుడు మనం అందరం  ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగు పెట్టాం.  అది కూడా పదహారు సంవత్సరాలు అయ్యాయి.

   మన దేశం లో ఎందరో అనాధలున్నారు.  వారిని సరియయిన విధంగా గుర్తించి వారిని రక్షించి ఒక సాంఘిక సంక్షేమ పథకం ద్వారా వారిని పనిమంతులు గా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన వుంది.  ప్రభుత్వం చట్టాలు చేసింది.  ఇంకా ఈ విషయం లో  కృషి చేసి బాలకార్మికులందరినీ  వారి కష్టాలనుండి విముక్తి కలిగించి ప్రయోజకులను చేయవలసినది.

   ప్రపంచం లో మన దేశం పరువు ప్రతిష్ఠ  ఇలాంటి సాంఘిక సమస్యలతో చాలా కిందకి పడిపోయింది. మన ప్రతిష్ఠని  పెంపొందించల్సిన వారు అందరూ ఈ విషయంలో కాదు శీఘ్రమే కృషి చేయాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
భవదీయుడు
కెవిన్

Similar questions