Letter to a friend about sankranti importance in Telugu
Answers
Answer:
sorry yaar don't now telgu
పేరు - రమ్య,
ఫ్లాట్ నెంబర్ - 123,
అపర్ణ అపార్ట్మెంట్స్,
మానస కాలనీ,
గుంటూరు,
తేదీ - 5 /3 /2020.
ప్రియమైన స్నేహితురాలికి,
నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావ్ అని అనుకుంటున్నాను. ఏం చేస్తున్నావు నిన్ను చూసి చాలా రోజులు అయినది ఈ సంక్రాంతి ను ఎలా జరుపుకున్నాము. నేను మాత్రం ఈ సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండగకి నేను మా అమ్మ నాన్నతో కలిసి మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లి అక్కడే జరుపుకున్నాము.
సంక్రాంతి అనేది తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. సంక్రాంతిని ప్రతి సంవత్సరము మకర రేఖ నుండి సూర్యుడు దూరంగా ఉన్నప్పుడు రోజు దాని గతి ప్రారంభమౌతుంది. సంక్రాంతి రైతుల పండుగ. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుపుకుంటారు. సంక్రాంతి ఆంధ్రులకు తమిళులకు పెద్ద పండుగ.
ఈ పండుగను మూడు రోజులు తప్పనిసరిగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రమణం, మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమ అని జరుపుతారు కావున దీనిని పెద్ద పండుగ అని అంటాము.
దీనిని ముఖ్యంగా రైతులు పంట చేతికి రావటం వలన ఆనందంతో ఈ పండుగను మకర సంక్రాంతితో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున రథం ముగ్గులు వేయటం ఒక ప్రాచీన సాంప్రదాయము. గొబ్బెమ్మలు పెట్టటం, భోగిపళ్లు పోయటం, హరిదాసులు రావటము, గంగిరెద్దు, గాలిపటాలు ఇవన్నీ సంక్రాంతి యొక్క ప్రత్యేకతలు.
ఈ పండుగ చాలా పవిత్రమైనది.
ఈ పండుగ పల్లెటూళ్లలో చాలా చక్కగా జరుపుతారు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారైనా సరే ఈ పండుగ వస్తుందంటే అందరూ తమ తమ సొంత ఊళ్లకు చేరుకుని తమ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పండుగ రోజున నువ్వు కూడా నాతో ఉంటే చాలా బాగుండేది కానీ నువ్వు లేకపోవటం వల్ల నేను నీతో ఇవన్నీ పంచుకోవాలని మీకు ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం నువ్వు చదివిన వెంటనే తిరిగి నాకు మళ్ళీ ఉత్తరం రాస్తావ్ అని ఆశిస్తున్నాను.
ఇట్లు
నీ స్నేహితురాలు
కావ్య.