India Languages, asked by hsgjhg9865, 1 year ago

LOCKDOWN SPECIAL QUIZ
1కుంతీదేవి అసలు పేరు ఏమిటి ?
2.ధృతరాష్ట్రుని కూతురు పేరు ఏమిటి ?
3.శ్రీ రామునికి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు బహూకరించారు ?
4.అలంబాసురుని ఎవరు సంహరిస్తారు ?
5.తారక మంత్రాన్ని మొదలు ఎవరు ఎవరికి ఉపదేశించారు?
6.నారదుని వీణ పేరు ఏమిటి? 7.వృకోదరుడు అని ఎవరిని అంటారు?
8.రావణుడి చెల్లెల్లు పేరు ఏమిటి?
9.అభిమన్యుడి కుమారుని పేరు ఏమిటి?
10.శకుని మాయా పాచికలు ఎలా తయారు అయ్యాయి?
11.దశరథుని అల్లుని పేరు ఏమిటి?
12.హనుమంతుని తల్లి తండ్రులు ఎవరు?.
13.ఘటోత్కచుని తల్లి ఎవరు?
14.శిఖండి గా మా‌రినది ఎవరు?
15.వంద తప్పుల తరువాత శ్రీ కృష్ణుడు ఎవరిని సంహరించాడు?
16.విరాట కొలువు లో ధర్మరాజు పేరు?
17.భగవధ్గీతకు ఇంకొక పేరు ఏమిటి?
18.గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు?
19.వ్యాసమహర్షి తల్లి తండ్రులు ఎవరు?
20.ధృతరాష్ట్రుడి అల్లుడు ఎవరు?

Answers

Answered by luckypriya077
1

Answer:

  1. ప్రుధ
  2. ధుః శ్చ
  3. అగస్త్య మహర్షి
  4. కృష్ణుడు
  5. శివుడు పార్వతికి
  6. కచ్చపి
  7. భీముడు
  8. శూర్పణఖ
  9. పరిక్షీఈతా
  10. శకుని వాళ్ళ నాన్న యొక్క ఏముకలు తో
  11. రిష్యశ్రింగుడు
  12. అంజనీ, వాయువు
  13. హిడింబి
  14. అంబ
  15. శిశుపాలుడు
  16. కంకభట్టు
  17. శ్రీ కృష్ణ గీత
  18. భీష్ముడు
  19. సత్యవతి, పరాశర మహర్షి
  20. జయద్రత

eటువంటి ప్రశ్నలు ఎక్కువుగా అడగండి....

Mark me as brainliest............

Answered by PADMINI
0

1. కుంతీదేవి అసలు పేరు పృథ

2. ధృతరాష్ట్రుని కూతురు పేరు దుశ్శల

3. శ్రీ రామునికి బ్రహ్మాస్త్రాన్ని అగస్త్య మహర్షి బహూకరించారు

4. అలంబాసురుని శ్రీ కృష్ణుడు సంహరిస్తారు.

5. తారక మంత్రాన్ని మొదలు శివుడు పార్వతి దేవికి  ఉపదేశించారు.

6. నారదుని వీణ పేరు కచ్చపి

7. వృకోదరుడు అని భీముడిని అంటారు

8. రావణుడి చెల్లెల్లు పేరు శూర్పణఖ

9. అభిమన్యుడి కుమారుని పేరు పరీక్షితుడు

10 .శకుని మాయా పాచికలు తండ్రి అయిన సుబలుని ఎముకలతో  తయారు అయ్యాయి

11. దశరథుని అల్లుని పేరు రుష్యశృంగుడు

12. హనుమంతుని తల్లి తండ్రులు అంజనా దేవి , కేసరి\వాయు.

13. ఘటోత్కచుని తల్లి హిడింబి

14. శిఖండి గా మా‌రినది అంబలో ప్రవేశించిన యక్షుడు

15. వంద తప్పుల తరువాత శ్రీ కృష్ణుడు శిశుపాలుడిని సంహరించాడు

16. విరాట కొలువు లో ధర్మరాజు పేరు కంకభట్టు

17. భగవధ్గీతకు ఇంకొక పేరు గీతోపనిషత్, పంచమ వేదం

18. గాంగేయుడు అని భీష్ముడిని  పిలుస్తారు

19. వ్యాసమహర్షి తల్లి తండ్రులు పరాశర మహర్షి, సత్యవతి

20. ధృతరాష్ట్రుడి అల్లుడు జయధ్రత సైంధవుడు

Similar questions