India Languages, asked by srinuanjunm, 2 months ago

నదుల్లో మాడా నెళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి
ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి. long ans​

Answers

Answered by BarbieBablu
107

నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.

జ. నదులు మనకు త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరిస్తున్నాయి. ఏ రకంగా నదులు సకలజీవకోటికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో కూడా నీరు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రకృతితోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి.

వాటిలో ముక్యంగా కొన్ని -

  1. సకాలంలో వర్షాలు కురవకపోవడం,వర్షపాతం చాలా తగ్గిపోవడం.
  2. ఎగువ రాష్ట్రాలు నదులపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం.
  3. విద్యుత్ ఉత్పత్తికి పరిమితికి మించి నీటిని వృథాగా ఖర్చు చేయడం.
  4. అడవులను పరిరక్షించకపోవడం.
  5. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం.
  6. నీటి పొదుపుపై ప్రభుత్వాలకు సరియైన అవగాహన లేకపోవడం.
Similar questions