long essay on newspaers in telugu
Answers
Answer:
హలో! నేను కూడా తెలుగునే!
నిత్యం ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ప్రజలకు తెలియజేసేవే వార్తా పత్రికలు . ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారథులు పత్రికలు. జనాలను చైతన్య పరుస్తూ, సమాజ నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి.
"ఒక పత్రిక 10000 సైన్యం తో సమానం. ఒక పత్రిక కోటి మిత్రులతో సమానం. పత్రికలు లేకపోతే ప్రజలకు రక్షణ లేదు." అని వేమన గారు చెప్పారు.
అంటే వార్తాపత్రిక అనేది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు.
" వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకంగా రాసిన నాలుగు వార్తాపత్రికలకు భయపడాలి." అని నెపోలియన్ అన్నారు.
ఎంత గొప్ప వారు కూడా వార్తాపత్రికలు అనేవి ఎంతో ముఖ్యమని చెప్పారు.
వార్తా పత్రికలు ప్రజలకు, పాఠకులకు అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని వార్తాపత్రిక యాజమాన్యాలు వార్తా పత్రికలను ప్రచురిస్తున్నాయి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థానిక వార్తలు పత్రికలలో పొందుపరుస్తున్నారు. వార్తా పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులు వార్తలను సేకరించి పాఠకులకు అందిస్తున్నారు. ప్రజా సమస్యలను, అవినీతి, అక్రమాలను, అన్ని రకాల అంశాలను వెలుగులోకి తెస్తూ, అందిస్తున్నారు. అనేక మంది పాఠకులకు ఉదయం నిద్రలేవగానే వార్తాపత్రిక (ఏదైన ఒక దినపత్రిక) చదవనిదే ఆ రోజు గడవదు. వారి దినచర్య పత్రికల పఠనంతోనే మొదలవుతుంది.
ప్రతి రోజూ ఉదయం ఒక పత్రిక చదవడమనేది మంచి అలవాటు.
పత్రికా పఠనం మేథోసంపత్తిని పెంచుతుంది. చక్కగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంచుతుంది. పత్రికలను చదువుదాం.. విజ్ఞానాన్ని పెంచుకుందాం.. పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం.