mahatma Gandhi shanti kosam poradina Panulu telugu lo
Answers
- శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్ తిరిగి వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
- అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు.
- అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి సందర్భంగా.. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడు కీలక పాత్ర పోషించిన ఘటనలు మీకోసం..
- మొదటి ప్రపంచ యుద్ధం:
- మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా నాటి వైశ్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫర్డ్ గాంధీని ఢిల్లీకి ఆహ్వానించాడు. యుద్ధం గురించి చర్చించి.. ఆర్మీలో ప్రజలను చేర్చడానికి ఒప్పుకోవాలని కోరాడు. బ్రిటిష్ పాలకుల విశ్వాసం చురగొనడం కోసం గాంధీజీ అందుకు అంగీకరించాడు. ‘వ్యక్తిగతంగా ఎవర్నీ చంపను లేదా గాయపర్చను. అది స్నేహితుడైనా, శత్రువైనా సరే’ అని వైశ్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.
HOPE SO IT HELPS U........
Explanation:
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరూ ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు అతన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న అతను ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
tq do follow me dear friend