India Languages, asked by mummy35, 1 year ago

mathru basha lo vidhya bodhana in telugu

Answers

Answered by tanvi7071
66
మున్సిపల్‌ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ధేశిస్తూ మున్సిపల్‌ పరిపాలన, అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 2న 14 జీవో ను విడుదలచేసింది. దీని ప్రకారం మున్సిపల్‌ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లం నేర్చుకోవడం ముఖ్యమైతే ఆంగ్లం నేర్పాలి, ఆంగ్ల మాధ్యమాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం? పాఠశాల సరిగా లేకపోతే ఆంగ్ల మాధ్యమం లో చదువుకున్నా ఆంగ్లం రాదని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. 2011లో ఆంగ్లాన్ని ఒక బోధనా విషయంగా, ద్వితీయ భాషగా ఒకటవ తరగతి నుంచే ప్రవేశపెట్టారు. అయితే అందుకు శిక్షణపొందిన ఉపాధ్యాయుణ్ణి మాత్రం నియమించలేదు. అలాంటి వారు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం విచిత్రంగా ఉంది. తెలియని భాషలో తెలియని విషయాలను బోధించే పద్ధతి అశాస్త్రీయమైనదే కాదు, ఇది విద్యార్థిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. విద్యార్థిలో సహజంగా ఉండే ఉత్సుకతను, సృజనాత్మకతను తుంచివేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్‌ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధిచెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్‌ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్నట్లు ప్రవర్తిస్తోంది. పరాయిభాషలో విద్య గరపడం జాతికి విద్యావంతులను దూరంచేయడమే. విద్యార్థి కూడా పరాయీకరణకు గురై మానసికంగా బలహీనుడవుతాడు. నేటి విద్యావంతులలో ఉన్న గొర్రెదాటు లక్షణానికి అదే కారణం. పాలకవర్గాలు కోరుకుంటున్నదిదే.
Answered by monujha1106
37

నిజానికి విద్యార్థులకు ఆంగ్లం అంతగా రావాలని మన పాలకులు కూడా కోరుకోవడంలేదు. మన పాలకులు కోరుతున్నదేమంటే విద్యార్థులు ఆంగ్లంలో సంభాషించడం నేర్చుకోవాలని మాత్రమే. అంటే విద్యార్థులు మంచి సేల్స్‌ మాన్లుగా తయారుకావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే అందుకవసరమైన ఆంగ్లం ఆరు మాసాలలోనే వస్తుంది. ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఆంగ్లం అవసరం కదా అంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు వైద్య విద్యను కూడా ఉర్దూ మాధ్యమంలో అందించింది. అటువంటప్పుడు తెలుగు మాధ్యమంలో, ఇతర భాషా మాధ్యమాలలో ఉన్నత విద్యాబోధన ఎందుకు సాధ్యంకాదు? పదవతరగతి వరకు పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్య మం, ఆంగ్ల భాషా బోధన సరైన విధానంగా ఉంటుంది. అయితే ఐఐటి కొరకు ఆంగ్లమాధ్యమం అంటున్నారు. పదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమంలో చదివిన విద్యార్థికి ఆంగ్లం కూడా సరైన పద్ధతిలో బోధిస్తే, ఇంటర్లో ఆ భాషకు తగిన తర్ఫీదునిస్తే ఐఐటి ప్రవేశపరీక్ష సులభంగానే రాయ గలరు. మాతృభాషా మాధ్యమంలో నేర్చుకున్నవారే గణితం, విజ్ఞానశాస్త్రాలు సృజనాత్మకంగా అర్థం చేసు కోగలరు. వారే ఆంగ్లాన్ని కూడా బాగా నేర్చు కోగలరు. ఇందు కు బలమైన రుజువులే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులలో తెలుగు మాధ్యమం వారికంటే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అధికంగా బడి మానేస్తున్నారని తెలుస్తోంది. 6 నుంచి 10 తరగతుల మధ్య విద్యార్థులలో తెలుగు మాధ్యమంలో బడి మానేసేవారు 14 శాతం అయితే, ఆంగ్లమాధ్యమంలోని వారు 31 శాతం మంది ఉన్నారు.
ఆంగ్లం వస్తే ఉద్యోగాలు వస్తాయని గట్టిగా వాదిస్తున్నారే గాని, ఆంగ్లోపాధ్యాయ ఉద్యోగం తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికీ ఆంగ్లం అవసరంలేదు. రాష్ట్ర సర్వీసు కమిషన్‌ వారే అనవసరంగా ఆంగ్లానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగం చేయవలసింది తెలుగు లేదా ఉర్దూ ప్రజల మధ్య అయినప్పుడు ఆంగ్లం అవసరం ఏమొచ్చింది? ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వ కార్యకలాపాలు, చట్ట సభలు, న్యాయస్థానాల వ్యవహారాలు ప్రజల భాషలలోనే ఉండాలి. అయితే అలా జరగడం లేదు. వైపరీత్యమేమంటే ప్రజల భాషలో వ్యవహారాలు జరపడానికి బదులు ప్రజలం దరికీ ఆంగ్లం నేర్పుతామంటున్నారు. ఏ ప్రభుత్వ లేదా ప్రయివేట్‌ పరిశ్రమలో పనిచేయడానికైనా ఆ పరిశ్రమకు ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది గాని ఆంగ్లం కాదు. అలాగే అమెరికా వెళ్ళడానికి కావాల్సిన ఆంగ్లాన్ని ఆరు మాసాల్లో నేర్పించవచ్చు. అంతేగాని మొత్తం విద్యను ఆంగ్ల మాధ్యమంగా మార్చాల్సిన అవసరం లేదు. 2008 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేస్తూ, ఆంగ్లాన్ని ఒక పాఠ్య విషయం గానే బోధిస్తున్నారు. ప్రయివేట్‌ను నియంత్రించడానికి బదులు ప్రభుత్వమే ప్రయివేట్‌ను అనుసరిస్తున్నది. ప్రభు త్వం తన దృక్పథాన్ని 

monujha1106: mark brainlist
mummy35: my wish
Similar questions