Matrubasha telugu dinotsavam essay in telugu language
Answers
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజునాడు మనం ఈ పండుగ, ఉత్సవం జరుపుకుంటున్నాం. 19వ శతాబ్దం, 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగం లలో తెలుగు భాష వ్రాసే విధానం (పుస్తకాలలో, పాఠాలలో) గ్రాంధిక భాష ఏనుసరించి ఉండేది. సామాన్యులకు ఏమీ అర్ధమయ్యేది కాదు. శ్రీ రామమూర్తి గారు వ్యవహరిక భాషని పుస్తకాలలో వాడే విధంగా చాలా చాలా కృషి చేశారు. విశ్వవిద్యాలయాలతో , పండితులతో ఎన్నో విధాలుగా పోరాడేరు.
ఈ రోజు న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అన్నీ జిల్లాలలోనూ పండుగ జరుపుతుంది. తెలుగు గురించి , తెలుగు గొప్పతనం గురించి మనం మాట్లాడి మన జాతి గర్వించతగిన మన తెలుగు వారి గురించి చెప్పుకొంటాం.
సాంస్కృతిక కార్యక్రమాలు , నాట్యాలు, కవితలు , పద్యాలు, కధలు, హాస్య పు జల్లులు ఇలా ఆరోజు ఆనందంగా గడుపుతాం. ఇవన్నీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో జరుగుతాయి.
మన పిల్లలు తెలుగు ని మరచిపోకుండా, వేరే భాషలతోపాటు తెలుగు ని కూడా గౌరవించాలని మనం ఈ పండుగ చేసుకుంటాం.
ఈ తెలుగు భాషా దినోత్సవం ఒకటే కాకుండా పాటు తెలుగు వారు ప్రపంచ తెలుగు వారి కోసం, తెలుగు ఉన్నతి కోసం, అందరి ఆనందం కోసం ప్రపంచ మహాసభలు కూడా జరుపుకుంటుంటారు.
Explanation:
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి