India Languages, asked by chshmish3174, 9 months ago

Nakunachina pani essay in Telugu

Answers

Answered by riyagupta12347
1

Answer:

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు.[ఆధారం చూపాలి] అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.

Answered by dreamrob
1

నాకు నచ్చిన పని:

నాకు నచ్చిన పని చిత్రలేఖనం చిత్రలేఖనం అంటే నాకు చాలా ఇష్టం. చిత్రలేఖనం అంటే మంచి మంచి బొమ్మలు గీయటం వాటికి మంచి మంచి రంగులు అద్దడం.ఈ పని అంటే నాకు చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టం నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చాలా రకములైన చిత్రాలు వేసేవారు చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరగటం వలన నాకు కూడా వాటిపై మక్కువ ఏర్పడింది.

నాకు ఈ పని చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా చాలా ప్రశాంతంగా మనసుకి హాయిగా అనిపిస్తుంది మా తల్లిదండ్రులు కూడా ఇలా ఇష్టాన్ని గౌరవించి ఇందులో నన్ను ప్రోత్సహించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో నేను చాలా చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనగా అందులో విజేతగా నిలవడం జరిగినది బహుమతులు అందుకోవడం జరిగినది.

నాకు రవివర్మ గీసిన చిత్రాలు అంటే చాలా ఇష్టం చిత్రాల్లో ఏదో ఒక ప్రత్యేకత ప్రతిబింబిస్తూ ఉంటుంది చిత్రలేఖనం అనేది ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం అని నేను నమ్ముతాను. ఇది ఒక విధమైన కళ దీనికి పరిమితులు ఉండవు. నేను వేసే చిత్రాలకి సహజత్వాన్ని ప్రతిబింబించేలా గీయటం అనేది ఉన్న ప్రత్యేకత.

భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర,సాంప్రదాయాలు, జీవనశైలి ఇలా దేన్నైనా ఆవిష్కరించగల గొప్ప గుణం చిత్రలేఖనానికి ఉన్నది. చాలా మంది గొప్ప గొప్ప కళాకారులు మన దేశంలో ఉన్నారు వారందరినీ వారందరూ వేసిన టువంటి చిత్రాలని కలెక్ట్ చేయడం వాటిని భద్రంగా దాచుకోవటం చిన్నప్పట్నుంచీ మా అమ్మగారి వలన నాకు అలవాటు అయినది.

నాకు బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఒక చిత్రాన్ని గీయటం అనేది నాకు అలవాటుగా వస్తూ ఉన్నది అలా ఒక చిత్రాన్ని గీయటం వలన దానికి రంగులు అద్దడం వల్ల నాకు ప్రశాంతత కలిగి ఎంతో హాయిగా ఉండగలుగు తాను.

ఒక చిత్రానికి రంగులు అద్దడం అనేది ఒక గొప్ప కళ ఇటువంటి గొప్ప కళ నాకు ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇష్టమైన పని ఉంటుంది నాకు మాత్రం చిత్రలేఖనం అంటేనే చాలా ఇష్టం.

Similar questions