India Languages, asked by shiransingh1251, 5 months ago

one short story with moral in telugu
with poet name
don't answer if you don't know​

Answers

Answered by pooja1042
1

Answer:

hi how are u

Explanation:

ఒక అడివిలో ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడ ఉన్నది. ఒకనాడు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటూఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విదిలించి తన కాలు క్రింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడ వణుకుతూ "మృగరాజా! నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను" అన్నది దీనంగా.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి "ఏమన్నావూ! నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలుగోరంత లేవు! ఈ అడవికి రాజును నేనెక్కడ? కన్నంలో దాక్కునే నీవెక్కడ? పిసరంత ప్రాణం గల నువ్వెక్కడ? అలాంటి నీవు! నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరిలే! ఫో!" అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది.

కొన్నాళ్ళ తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకొన్నది. వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్న తప్పించుకోలేకపోయినది. "కాసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో, ప్రాణమే తీస్తాడో" అని విచారించ సాగింది సింహం. అటువైపు పరుగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. "అయ్యోపాపం" అని జాలిపడింది. వలతాళ్ళను తన వాదిడంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది. సంతోషించింది కూడా. వలతాళ్ళు కోరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది.

"ఒకనాడు నేను నిన్ను నా కాలుగోటితో సమానమన్నాను, ఈసడించుకున్నాను. ఈ రోజు నీవే నా ప్రాణం కాపాడావు! నన్ను క్షమించు" అన్నది సింహం. ఆనాటి నుండి అవి స్నేహంగా జీవించినవి.

Similar questions