India Languages, asked by MeghnaaSarkar2499, 1 year ago

Parisarala parisubraths essay in Telugu language

Answers

Answered by divyajyothidadmomdad
47
వ్యర్థాలను సక్రమంగా పారవేద్దాం

పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం

అంటువ్యాధుల్ని తరిమేద్దాం

బహిరంగ మల విసర్జన : chala chotla ekkada padite akkada mala visarjana cheyadam neram. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఈగలు, పురుగుల ద్వారా విసర్జిత మలం నీటిలోనికి, ఆహారంలోకి చేరి తద్వారా నోటిలోనికి చేరి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. దీని వల్ల వచ్చే జబ్బులైన టైఫాయిడ్‌, కలరా, అతిసార, కామెర్లు వంటి వ్యాధుల్ని అరికట్టలేం. దీనికి ఏకైక పరిష్కారం వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం మాత్రమే. కేరళలో 40ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికి సెప్టిక్‌ లెట్రిన్‌ అమరింది. అక్కడ బహిరంగ మలవిసర్జన లేదు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉన్న వాళ్లకు కూడా అది లేని వారితో ప్రమాదమే. అందుచేత నూటికి నూరుమంది మరుగుదొడ్లు ఉండాల్సిందే !

తమ ఇళ్లే కాదు పరిసరాలను కూడా శుభ్రంగా ఉం చుకోవాలనే స్ఫూర్తితో మొదలైన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా పట్టణాల్లో రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. అలాగే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు బుట్టలు పంపిణీ చేశారు. అవి కూడా దుర్వినియోగం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్వచ్ఛత కోసం ప్రభుత్వాలే కాదు పౌర సమాజం కూడా పనిచేయాలి. అప్పుడే మార్పు సాధ్యమౌతుంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పారిశుధ్య పనులను నిత్యం పర్యవేక్షించాలి. రోడ్లపై చెత్త వేయకుండా చూడాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరా లు శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహనను ప్రజల్లో కల్పించాలి. ఇందుకోసం చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. పరిసరాల పరిశుభ్రత అనేది నినాదం గా కాకుండా నిత్యం జరుగాలి. అప్పుడే స్వచ్ఛభారత్ సాధ్యమౌతుంది.
Answered by dhanram98
0

Answer:

add more information

because we need more information

short essay it is nice but please add more

Similar questions