కరోనా సమయంలో కూలీ జీవితం గురించి వ్రాయండి
please answer in Telugu who knows
Answers
Answer:
కూలీ బతుకు కూలి పోతోంది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉన్న ఊరును వదిలి..ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వచ్చిన వారు ప్రస్తుతం బతుకు జీవుడా..అంటూ మళ్లా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కానీ…ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
గమ్యం చేరుకోకముందే..అనంతలోకాలకు వెళ్లిపోతుండడంతో అందర్నీకదిలించి వేస్తున్నాయి. సంపాదించే వారు చనిపోతుండడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించినా..వారి సమస్యలు పరిష్కారం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘కూటి కోసం కూలి కోసం..పట్టణంలో బతుకుదామని..తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’ అంటూ మహాకవి శ్రీశ్రీ ఏనాడో పాట రాశారు. ఆయన రాసిన పాట…సొంతూళ్లకు వెళుతున్న కూలీల కన్నీటి గాథలు చూస్తే..నిజమేననిపిస్తోంది. కళ్లు చెమర్చే విధంగా..ఘటనలు కనిపిస్తున్నాయి. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు అందర్నీ కదిలించాయి.
తెచ్చుకున్న ఆహారం అయిపోవడం..కాళ్లకు బొబ్బలు వచ్చినా..వారు మాత్రం గమ్యాన్ని మాత్రం వీడడం లేదు. ఈ క్రమంలో ఎంతో మంది చనిపోతున్నారు. నడుస్తూ..విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్న వారిపై వాహనాలు వెళ్లడంతో…కొంతమంది చనిపోయారు.
సొంతూరుకు వెళ్లి గంజి తాగుదామని అనుకున్నారు. వలస కూలీల తరలింపులో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కానీ కొన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంతో…కూలీలకు సమస్యలు తప్పడం లేదు. స్థానిక అధికారులను ఆశ్రయించినా..ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది. రోడ్డుపైకి ఎక్కి..కనిపించిన వాహనాలు ఎక్కి..వెళుతున్నారు.
ఎర్రటి ఎండలో ప్రయాణిస్తూ..పెద్ద సాహసమే చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదాలను ఎలా ఆపగలమని, రాష్ట్రాలు బాధ్యతీ తీసుకోవాలని సూచించింది.
Explanation:
Hope this answer