India Languages, asked by sreekarreddy91, 4 days ago

Please answer the questions​

Attachments:

Answers

Answered by tennetiraj86
9

Explanation:

జవాబులు :-

1.

అసామాన్యులు పాఠం వ్యాస ప్రక్రియకు సంబంధించినది .

2.

ఆహార ప్రాధాన్యత ను గిరించి తెలిపిన మొదటి వారు ఆదివాసులు , అడవులే అమ్మ ఒడిగా, కొండ కోనలే తోడు నీడలుగా చేసుకుని జీవనము సాగించు వారి ఆదివాసులు.

3.

బంగారం పని చేసేవారిని స్వర్ణ కారులు అంటారు .

4.

చక్రం ఆవిష్కరణ మానవ పురోగతిని చాలా ముందుకు తీసుకెళ్లింది. కుమ్మరి వారూ వారి చేతి నైపుణ్యాలను చేర్చి రకరకాలుగా కుండలు వివిధ ఆకరాలను తయారు చేస్తారు .కుమ్మరి మరియు వడ్రంగి వారి నైపుణ్యం కలయిక. ఈ చక్రం ఆవిష్కరణ నేటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సమానమైనది .అందుకే చక్రం తాను తిరగడమే కాదు మానవ గతిని తిప్పింది(మార్చింది) అనడంలో సందేహం ఎంత మాత్రము లేదు.

5.

ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకున్నాయి .

అన్ని వృత్తుల సమిష్టి యే మానవ జీవనం. మానవ జీవితం ముందుకు సాగాలంటే అన్ని వృత్తుల సహాయం అవసరం

కావున ప్రతీ వృత్తి పవిత్రమైనది.

6.

ఎండాకాలము వచ్చిందంటే చాలు మనకు నీటి కుండలు , గరిటెలు అవసరం . బంక మట్టిని తెచ్చి కాళ్లతో తొక్కి చక్రం పై వేసి ఆకారాన్ని తయారు చేసి నిప్పు పై కాల్చి చేసే ఈ వృతి గొప్పది.కుమ్మరి వారూ వారి చేతి నైపుణ్యాలను చేర్చి రకరకాలుగా కుండలు వివిధ ఆకరాలను తయారు చేస్తారు .కుమ్మరి మరియు వడ్రంగి వారి నైపుణ్యం కలయిక. ఈ చక్రం ఆవిష్కరణ నేటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సమానమైనది .

7.

దేశానికి వెన్నెముక రైతు, ఎండనక , వాన అనక, రేయి అనక, పగలనక నడుమూర్చి కష్టపడి విత్తనాలు వేసి దుక్కి దున్ని నారి వేసి కొత్త కోసి పంట నెత్తి సాగు చేసే రైతు , లోకానికి అన్నం పెట్టే మానవ బ్రహ్మ ఈరోజు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఒక వైపు ప్రకృతి విలయతాండవం (అతివృష్టి, అనావృష్టి) మరొక వైపు మండుతున్న ఎరువుల ధరలు, నీటి కొరత అన్ని కలిసి రైతుని రైతు కూలీగా, రోజు కూలీగా చేస్తుంది. అన్నదాత ఎప్పుడు తాను కష్టం పడుతూ అందరి ఆకలి తీరుస్తున్నాడు.

8.

క్షురము అనగా కత్తి ,క్షురకుడు అనగా తల వెంట్రుకలు కత్తిరించేవాడు అని అర్థము.

9.

సమాజము అన్ని వృత్తుల సమాహారం తో ముందుకు సాగుతున్నది ఇందులో ఒకటి తక్కువ ఇంకొకటి ఎక్కువ లేదు అన్ని సమానమే అన్ని అవసరమే.

10.

నేత పని వారు మనకు కావలసిన బట్టలకు ఆద్యులు,కమ్మరి వారు మనకు కావలసిన సామగ్రి కి అవసరం.కుమ్మరి వారి వస్తువులు అవసరం.స్వర్ణకారుల ఆభరణాలు అవసరం. క్షురకుల అవసరం తప్పనిసరి ఇలా అందరి అవసరం మనకు ఎంత అయిన ఉన్నది . నాకు అన్ని వృత్తులవారు అంటే ఇష్టమే. మనము మన ప్రపంచం అన్ని వృత్తులవారి వలనే ముందుకు సాగుతున్నది .ఏది లోపించిన బ్రతుకు బండి చక్రం ముందుకు సాగదు.

Answered by IqBroly
0

Answer:

Question Title. * 1. What is the purpose of your visit? Question Title. * 2. Did you find what you were looking for? Question Title ...

Explanation:

Similar questions