Please answer the questions
Answers
Explanation:
అ. అర్ధాలు :-
1.కర్దమము = బురద
2.దేశంద్రీయ రోగములు = పదిరకాల రోగములు
3.లవణము = ఉప్పు
4.చందనం = గంధము
5.గుడము = బెల్లము
6.ఘనత = కీర్తి, గొప్పతనం
7.లేశము = కొంచెము
8.శాకము = కూర
9. వృషభం = ఎద్దు
10.విత్తము = ధనము
ఆ. పర్యాయ పదాలు :-
1. నీరము = నీరు, పానియము
2.హితము =మేలు, మంచి
3.మక్కువ = ఇష్టం , ప్రేమ
4.కరము = చేయి, ఏనుగు
5.శక్తి = బలము, స్త్రీ
ఇ. ప్రకృతి-వికృతి:-
1.దూరం = దువ్వు
2.నాగలి = లాంగలము
3.ధర్మము = దమ్మము
4.దాహం= దగ
ఈ. సొంత వాక్యాలు :-
1.ఉక్కిరిబిక్కిరి = ఇబ్బంది పడటం
మా తాతయ్య శ్వాస సరిగ్గా పీల్చుకోక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు .
2.సహృదయత = మంచితనం
మథర్ థెరిస్సా సహృదయతకు ప్రపంచం మొత్తం శిరశావహించాల్సిందే.
3.విచక్షణ= మంచి చెడులను గుర్తించు స్వభావం
జంతువులకు విచక్షణా స్వభావం ఉండదు.
4.పరిమళము = సువాసన
మా పెరటిలో గులాబీల పరిమళము వీధి చివరకు వస్తుంది.
ఉ. సంధులు :-
1.పాలకేమి = పాలకు + ఏమి
2.లవణమన్నము = లవణము+ అన్నము
3.మరుగైనా = మరుగు + ఐనా
4.వేదములందు = వేదములు + అందు
ఊ. సమాసాలు :-
1.దానాధర్మములు = దానమును, ధర్మమును
2.తల్లి గర్భము = తల్లి యొక్క గర్భము
3.మంచి కూర = మంచిదైన కూర
4.నలపాకము = నలుని యొక్క పాకం