India Languages, asked by likitha4206, 11 months ago

కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక స్వయం ఉపాధి పథకం గురించి వ్యాసం వ్రాయుము



please fast!! text in telugu only

Answers

Answered by saisrinivas95395
0

Answer:

గ్రామీణాభివృద్ధి దిశగా ఎన్నో ప్రభుత్వపథకాలు అమలులో ఉన్నాయి. వ్యక్తిగత వికాసం మొదలుకొని, కుటుంబ, సంఘ, సమాజ పరిపూర్ణ వికాసం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుపరచబడుతున్నాయి. ఫ్రతి పథకం లక్ష్యం వేరు, లక్ష్యసమూహం కూడా వేరు. మనిషి సామాజికంగా, మానసికంగా, శారీరికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచే భావనతో, ప్రతి పథకం కార్యాచరణ నిర్వచించబడింది. అత్యంత సూక్ష్మ స్థాయి అంశాలనుండి, స్థూలస్థాయి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ పథకాలు రూపు దిద్దుకున్నాయి. ఉదాహరణకు చేతులు శుభ్రత వినడానికి సూక్ష్మమంగా అంపించవచ్చు. కాని అది ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి మెట్టు. అందుకే పథకాన్ని కాకుండా, వికాస అంశాలను దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధి పథకాలు వివరించడం జరిగింది. కార్యాచరణ వివరములు

వ్యక్తిత్వవికాసముపరిశుభ్రమైన అలవాట్లు మరియు పద్దతులు

లక్ష్యం: వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందించడం.

పళ్ళను తోముకోవడం

రోజు స్నానం చేయడం

మరుగుదొడ్లను ఉపయోగించడం

మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను బాగా కడుక్కోవడం

బట్టలను శుభ్రంగా ఉతుక్కోవడం

ఋతుక్రమంలో కిషోర బాలికలు మరియు స్త్రీలు వ్యక్తిగత శుభ్రతను పాటించడం

వ్యూహం

స్వచ్చంద కార్యకర్తల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయడం

అంగన్ వాడి కేంద్రాలు పాఠశాలలు, స్వయంశక్తి సంఘాల ద్వారా అవగాహన కల్పించడం

వీధినాటకాలు, లఘు చిత్రాలు

కమ్యూనిటీ రేడియో

జాతీయ ఆరోగ్య మిషన్

పథకాలు

సమగ్ర బాలల అభివృద్ధి పథకం

స్వచ్చభారత్

ఫ్రతిఫలాలు

యువజన కార్యకర్తలతో ఆరోగ్య పరిరక్షణ బృందాలు ఏర్పాటు చేయుట

గృహ సందర్శనాలు

ముందుగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించిన వారిని ప్రోత్సహించడం, పాటించని వారిని పాటించేలా చేయడం

ఫలితాలు

అతిసారం మరియు ఇతర అంటు వ్యాధులను అరికట్టడం

ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడం

ఆరోగ్యము మరియు సంక్షేమాన్ని పెంపొందించడం

క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేసే అలవాటును నేర్చుకొనేలా యడం

లక్ష్యం: వయస్సు మరియు లింగ బేధం అనుసారంగా ప్రతి రోజు వ్యాయామ చేయడం

వ్యూహం

వ్యాయామశాలకు వెళ్లడం, నడక, పరుగెత్తడం, క్రీడలు వంటి వాటిని అభిరుచికి అనుసారంగా లభించేలా చేయడం

పై వాటిని ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రోత్సహించడం

పథకాలు

ఎమ్. పి లాడ్స్

నెహ్రూ యువ కేంద్రాలు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పధకం

రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పధకాలు

ప్రతిఫలాలు

క్రీడా మైదానాలు మరియు పార్కుల అభివృద్ధి

శారీరక శ్రమ చేయడానికి కావలిసిన అవకాశాలను కలుగజేయడం

గ్రామాలలో ప్రతి దినం వ్యాయామ నియమావళిని ఆచరించడం

ఫలితాలు

ఆనారోగ్య నివారణ

ఆరోగ్య పరిరక్షణ

మధ్యపానం, ధూమపానం మరియు మత్తు మందులకు బానిసలు కాకుండా నివారించడం. మరియు పై వాటికి బానిసలు అయిన వారిని గుర్తించడం.

స్వయం శక్తి బృందాలలో పై విషయాల పై అవగాహన కలిగించడం

పాఠశాలలు, యువజన సంఘాలు, స్వయం శక్తి బృందాల ద్వారా ప్రచారం చేయడం

పథకాలు

జాతీయ ఆరోగ్య మిషన్

ఎమ్ లాడ్ నిథులు

ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ పథకాలు

ప్రతిఫలాలు

ప్రమాదకరమైన ప్రవర్తన మరియు మాదక మరియు మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని గుర్తించడం.

పైన పేర్కొన్న ప్రవర్తన తగ్గేలా సామాజిక కట్టుబాట్లు చేయడం

పై అలవాట్లు ప్రోత్సహిస్తున్న మార్గాలు మరియు సంస్థలను నివారించడం

మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని వాటి నుండి కాపాడటం

ఫలితాలు

కుటుంబ మరియు సమాజ శ్రేయస్సు

ఆరోగ్య పరిరక్షణ

సమాజం మరియు కుటుంబంలో శాంతిని నెలకొల్పటం

స్త్రీల పట్ల జరిగే దురాగతాలను నివారించడం

ఆరోగ్యం మరియు పోషణ

లక్ష్యాలు

ఆరోగ్య కార్డు, వైద్య సదుపాయాలు వంటి మౌళిక ఆరోగ్య సదుపాయాల సార్వత్రిక అందుబాటు

సమగ్ర వ్యాధి నిరోధక టీకాలు వేయించడం

సమతుల్య పోషణ

సమతుల లింగ నిష్పత్తి

వ్యూహం

ఆరోగ్య మౌళిక సదుపాయాలు మరియు వస్తువుల లోపాన్ని గుర్తించడం

శిక్షణ పొందిన ఆరోగ్య మరియు పారా హెల్త్ నిపుణుల ఖాళీలను గుర్తించడం

ఆరోగ్య మరియు పారా హెల్త్ నిపుణులకు కావలిసిన నైపుణ్యాలను గుర్తించడం

వ్యాధి నిరోధక టీకాల శిబిరాలను ఏర్పాటు చేయుట

ఆరోగ్య కార్డును అందచేయడం

వీధి నాటకాలు మరియు తోలుబొమ్మలాట వంటి ప్రదర్శన ద్వారా ఆరోగ్య అవగాహన పై కాలెండర్ తయారు చేయుట

రక్తహీనత, ఆరోగ్యం మరియు పరిశుభ్రత వంటి విషయాలపై అవగాహన కలుగజేయుట

మధ్యాహ్న భోజన పధకము మరియు పోషకాహార పథకమును పాఠశాలలు మరియు అంగన్ వాడీలలో సక్రమంగా అమలు జరిగేలా చూడటం

పథకాలు

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)

సమగ్ర బాలల అభివృద్ధి పథకం (ICDS)

ప్రతిఫలాలు

మాతృ, శిశు మరణాల రేటు తగ్గటం

వ్యాధి నిరోధక టీకాలు వేయడం

ఆసుపత్రిలో ప్రసవం జరిగేటట్లు చేయడం

గ్రేడు III మరియు గ్రేడు IV రక్త హీనతను తగ్గించడం

పిల్లలలో పోషకాహార లోపాలను నివారించడం అదేవిధంగా రక్తహీనతను స్త్రీలు, గర్బిణీలు మరియు కిశోర బాలికలలో నివారించడం

ఫలితాలు

వందశాతం వ్యాధి నిరోధకత

వందశాతం ఆసుపత్రిలో ప్రసవం

స్త్రీలు, గర్బిణులు, పిల్లలు మరియు కిశోర బాలికలలో పోషకాహార లోపాలను నివారించడం

ఆరోగ్య నిపుణులు యొక్క నైపుణ్యాలను పెంపొందించడం

ఆరోగ్య మరియు పరిశుభ్రత పై సానుకూల వైఖరి మరియు ప్రవర్తనను పెంపొందించుట

Similar questions