India Languages, asked by Anurag3576, 3 days ago

భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.Please help in this​

Answers

Answered by ramanimanoj84
5

Answer:

జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత

ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ

బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా

పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు

జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు

దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు

పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు

నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు

నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు

వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు

నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||

Similar questions