శతక పద్యాలు ఆధారముగా చేయవలసిన పనులు, చేయకూడని పనులు, (లేఖసం)
Please tell me answer for this
Answers
Answer:
తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం (sumathi Satakam) ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.శతకము (Satakamu) అనగా వంద. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే ముకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని ముకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకమునకు ముకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకమునకు ముకుటము, అలాగే వెంకటేశ్వరా, దాశరదీ అనునవి ఇతర ఉదాహరణములు. సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం.
శతక పద్యాలు ఆధారముగా చేయవలసిన పనులు, చేయకూడని పనులు:
Explanation:
- శతకంలోని పద్యాలు కేవలం ఒకే పార్వ్శంలో కాకుండా అన్ని మానవ గుణాలు, విలువలు, జీవిత విధానాలపై స్పష్టతను ఇస్తాయి.
- శతక పద్యాలు ఆలోచనలను పెంచుతాయి. ఆలోచింపజేస్తాయి. జీవితానికి ఏవి అవసరం, ఏవి అనవసరమో తెలియజేస్తాయి.
- తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు.
- తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.
- జీవితలక్ష్యం, జీవిత పరమార్ధం, సామాజిక సంబంధం ఇలా పలు విషయాలలో ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క మనస్తత్వం గురించి శతకాలు యందు ఉండేడి పద్యాలలో ఉంటాయి.