రాజు కువలయానంద కరుడు .
ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి
plz 20 points i want correct answer not silly plz
Answers
Explanation:
కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. ‘అలం’ శబ్దానికి ‘కృ’ ధాతువు చేరి ‘అలంకారం’ రూపం ఏర్పడింది. అలంకారమంటే భూషణమని అర్థం. కావ్య సౌందర్యాన్ని పెంపొందించి శోభను కలిగించేవి అలంకారాలు. అలంకారికులు ప్రధానంగా శబ్దా లంకారాలు, అర్థాలంకారాలు రెండు రకాలుగా పేర్కొన్నారు.
శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలు. శబ్ద వైచిత్రీ రామణీయకత చేత కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సంగీతానుగుణ్యమైన శ్రవణ లాలిత్యంతో పాఠకులకు ఆహ్లాదం కలిగించే శబ్దాలంకారాలు.
ఇవి ఆరు విధాలు..
1) వృత్త్యానుప్రాసం
2) ఛేకానుప్రాసం
3) లాటానుప్రాసం
4) అంత్యానుప్రాసం
5) యమకం
6) ముక్తపదగ్రస్థం
అర్థాలంకారాలు: అర్థ సౌందర్యం చేత కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం
Explanation:
ఇచ్చినది:-
రాజు కువలయానంద కరుడు .
ప్రశ్న :-
ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి
జవాబు
రాజు కువలయానంద కరుడు లో ఉన్న అలంకారం
శ్లేషాలంకారం
వివరణ:-
రాజు కువలయానంద కరుడు లో రాజు కువలకు ఆనందకరుడు .
ఇచట , రాజు అనగా ప్రజలను పరిపాలించువాడు మరియు చంద్రుడు అని అర్థాలు వస్తాయి.
కువలు అనగా ప్రజలు మరియు కలువలు అని అర్ధం .
మొదటి అర్ధం :-
రాజు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తాడు.
రాజు అనగా చంద్రుడు అని అర్ధం వస్తుంది
కువలం అనగా కలువలు అని అర్ధం వస్తుంది
కావున ఈ వాక్యానికి
రెండవ అర్ధం :-
చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగిస్తాడు.
అనే అర్థం కూడా వస్తుంది.
శ్లేషాలంకారం:-
నానార్ధాలను ( అనేక అర్ధాలను) కలిగి ఉన్న అలంకారం.
శ్లేష అనగా వాక్యంలో ఉన్న పదాలకు వేరు వేరు అర్ధాలను బట్టి వాక్యాన్నీ రెండు అర్ధాలు వచ్చేటట్టుగా వచ్చే లక్షణం.
ఇది అర్థాలంకారాలలో ఒకటి.