రాజేంద్రుడు విడదీసి సంది పేరు రాయండి
plz answer the question
Answers
సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది.
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు.
ఉదా:
రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం
2. గుణ సంధి: అకారానికి ఇ-ఉ-ఋలు పరమైతే క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశ మవడాన్ని గుణసంధి అంటారు.
ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు
ఇతర + ఇతర = ఇతరేతర
రాజ + ఋషి = రాజర్షి
3. వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు.
ఉదా:
భువన + ఏక = భువనైక
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం
పాప + ఓఘం = పాపౌఘం
పరమ + ఔషధం = పరమౌషధం
ఋణ + ఋణం = ఋణార్ణం
Answer:
I can't understand ur QN or language