India Languages, asked by krishnacharanp, 3 months ago

ఏ కులం ?" పాఠం కవి చరబండరాజు గురించి రాయండి?




plz reply me fast plz​

Answers

Answered by harithayalagapudi
1

Answer:

చెరబండరాజు (1944 - జూలై 2, 1982) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి" ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి.

చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి. అతను హైదరాబాదు జిల్లా అంకుషాపూర్ లోని ఒక పేద రైతు కుటుంబంలో 1944లో పుట్టాడు. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతను ఆరుగురు దిగంబరకవులలో ఒకడు. "నన్నెక్కనివ్వండి బోను" అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించాడు. దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు "వందేమాతరం" గేయం పలువురి ప్రశంసలు పొందింది. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, కార్యదర్శిగా 1971-1972 లో పనిచేసాడు. దిగంబరకవి నుండి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశాడు. 1975 ఏప్రిల్లో ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్టు అయ్యాడు. 1971 నుండి 1977 మధ్యకాలములో మూడేళ్ల పాటు జైళ్లో గడపడం వలన ఈయన ఆరోగ్యము క్షీణించింది. జైళ్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్ గా పరిణమించింది. 1977 నుండి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈయన అనారోగ్యముతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవలసి వచ్చింది.

Answered by javvajihansika171
0

ఏ కులం ?" పాఠం కవి చరబండరాజు గురించి రాయండి

Similar questions