poem about pigeon parrot peocock in telugu language
Answers
Answered by
0
Answer:
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగో గిలక.. ఆడుకో త్వరగా
గిలకా వద్దు సిగ్గుల మొలకా
చక్కగ రాసే పలకా ఇవ్వు
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగోనమ్మా చక్కటి పలకా
చక్కటి పలకా వద్దు వద్దు
చిక్కగ పేనిన నులక చాలు
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగోనమ్మా చక్కటి నులక
చక్కటి నులక వద్దు వద్దు
ఏపుగ పెరిగే మొలకలివ్వు
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగోనమ్మా గుప్పెడు మొలకలు
గుప్పెడు మొలకలు వద్దు వద్దు
చిక్కటి చక్కటి పిలక ఇవ్వు
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగోనమ్మా చక్కటి పిలక
చక్కటి పిలకా వద్దు వద్దు
ఆడుకుంటాను ఎలకనివ్వు
చిలకా చిలకా వెన్నెల మొలకా
ఇదిగోనమ్మా ఎగిరే ఎలక పిల్లా
ఎగిరే ఎలక పిల్లా వద్దు వద్దు
నా లాంటి చిలకలే చాలు చాలు
Similar questions