'చెడ్డ మనిషికి శరీరం నిండా విషం ఉంటుంది' అని కవి ఎందుకు చెప్పి ఉంటాడు ?
Points: 10
Bhavani2000life I expect you to Answer!
Answers
Answered by
7
I too Expected!
Answer:
మానవ జన్మ దుర్లభమైంది. మనుషుల్లో సజ్జనులు, దుర్జనులు ఉంటారు. సజ్జనులు లోకహితాన్ని కోరుతారు. దుర్జనులు ఇతరుల శ్రేయస్సుకు ఆటంకం కల్గిస్తారు. సమాజానికి కీడు చేస్తారు. దుర్జనుని శరీరమంతా విషంతో నిండి ఉంటుంది. అతడి ప్రతి ఆలోచన విషతుల్యంగా ఉంటుంది. ఎల్లప్పుడు దుర్మార్గంగా ఆలోచిస్తాడు. మోసాలకు పాల్పడతాడు. స్త్రీలను గౌరవించడు, దురాలోచనతో ప్రవర్తిస్తాడు. ఎల్లప్పుడూ ఎదుటివాళ్ళ పనులు చెడగొట్టాలనే ఆలోచన ఉంటుంది.
కష్టపడకుండా, దొంగతనాలు చేసి ధనాన్ని పొందాలనుకుంటాడు. అందువల్ల దుర్జనుడు ఎప్పుడు ఏ రకంగా దుశ్చర్యలకు పాల్పడతాడో ఎవరికీ అర్థం కాదు. కావున పనులు దుర్జనుల నుంచి అప్రమత్తంగా ఉండాలి.
Similar questions