prepare a పాంప్లెంట్ for Saraswathi matha aksharbhysam in Telugu
Answers
Answer:
22న వసంత పంచమి అదిలాబాద్ జిల్లాలోని బాసర దేవాలయం దేశంలోని సరస్వతీ దేవి ఆలయాల్లో ప్రసిద్ది చెందిన ఆలయం. ఈ ఆలయానికి పురాణ ఇతిహాసాలతో పాటు చారిత్రిక నేపథ్యం ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం మనశ్శాంతి కోసం వేదవ్యాసుడు ఇక్కడి దండకారణ్యంలో గోదావారి తీరప్రాంత ప్రశాంతతను చూసి కుటీరాన్ని నిర్మించుకున్నట్లు స్థలపురాణం చెబుతుంది. వేదవ్యాసునికి జగన్మాత ప్రత్యక్షమై ఆలయాలను నిర్మించమని చెప్పగా గోదావరి నుంచి మూడు దోసిళ్ళ ఇసుకతెచ్చి దేవతామూర్తులను ప్రతిష్టించి పూజించగా ఈప్రాంతానికి వ్యాసపురిగా పేరువచ్చింది.అయితే మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో వ్యాసపురి క్రమేణ వాసర, బాసరగా మారింది. అనంతరం వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాసినట్లు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. సరస్వతి దేవిని నిత్యం ప్రార్థిస్తూ రామాయాణాన్ని వాల్మీకి ఇక్కడ రాసారని పురాణకథనం. బాసర జ్ఞానసరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యక్షేత్రం దేశంలోనే ప్రసిద్ధికెక్కింది. చారిత్రిక నేపథ్యం కూడా ఈ ఆలయానికే సొంతం. రాష్ట్రకూటులు ఆలయ అభివృద్ధి కోసం అనేక నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. వీటితో పాటు 6వ శతాబ్దంలో నందగిరి నేటి నాందేడు రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయానికి మరమ్మతులు చేశారు. వేదవ్యాసుడు ప్రతిష్టించగా వాల్మీకి పూజలందుకుని రాష్ట్ర కూటుల రాజవంశాలతో నిర్మాణాలు చేసిన బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయం వంసంత పంచమి, శ్రీపంచమి సందర్భంగా ప్రత్యేక పూజలకు సిద్ధమైంది.
మహోన్నతమైన భారతీయ సంప్రదాయాల్లో పండుగలకు పర్వదినాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. హరప్పా నాగరికతలో అమ్మతల్లిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యం అవుతున్నాయి. రుతువులను ఆలంబనగా చేసుకుని నిర్వహించే పండుగల్లో వసంతపంచమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మాఘ శుద్ధపంచమి నాడు నిర్వహించే ఈ పర్వదినాన్ని శ్రీపంచమిగా కూడా వ్యవహరిస్తారు. ప్రకృతిలో జరిగే సూచనలకు ఏర్పడిన పండుగల్లో శ్రీ పంచమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
సకల విద్యాదినంగా పాటించే శ్రీపంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, పండితుల గోష్టి నిర్వహించడం జరుగుతుంది. సరస్వతి దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేకపూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేస్తే సకల విద్యాపారంగతులవుతారనేది అనాదిగా వస్తున్న నమ్మకం. అలాగే ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే కోరికలు సిద్ధిస్తాయని హేమాద్రి పండితుడు పేర్కొన్నారు. అలాగే వ్రతచూడామణిలో బ్రాహ్మణులకు సంతర్పణచేసి పుణ్యకార్యాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఉత్తరభారతదేశంలో వసంతపంచమి ఆరంభంలో రతీమన్మధులను పూజించి మహోత్సవాలు నిర్వహిస్తే మాధవుడు సంతోషిస్తాడనే నమ్మకం ఉంది. జ్ఞానానికి అధిదేవత సరస్వతి, ఆమె జ్ఞాన స్వరూపిణి, శాస్త్రం,కళలు,విజ్ఞానం,హస్తకళలు,సృజనాత్మకశక్తికి,స్ఫూర్తికి కూడా వీణాపాణి సరస్వతి సంకేతం. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతిమాత అందుకే అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి,మహాలక్ష్మి,మహాసరస్వతి గా కీర్తిస్తారు. అయితే ముగ్గురిలో సరస్వతీదేవి సాత్వికమూర్తి,అహింసాదేవి,యుద్ధం చేసే ఆయుధాలు లేని జగన్మాత. అందుకే బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది.
మకర సంక్రమణం అనంతరం క్రమక్రమంగా వసంతరుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. వసంత పంచమిని శ్రీ పంచమిగా,మదనపంచమిగా,సరస్వతి జయంతిగా దేశప్రజలు సంప్రదాయసిద్ధంగా జరుపుకుంటారు.సరస్వతీదేవికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలైన వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ అశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అర్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదనను పెంచుతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదశక్తిదాయిని కావున వసంతపంచమి వసంతానికి ఆరంభసూచకంగా సరస్వతిపూజ నిర్వహించుకోవడం సహేతుకం. అందుకే జ్ఞానానికి,విజ్ఞానానికి ప్రతీకైన సరస్వతీదేవిని శ్రీపంచమిరోజు అనేకరూపాలతో ఆరాధించడం,ప్రత్యేకపూజలు నిర్వహించడం ఆచారమైంది.
చదువులతల్లి సరస్వతి దేవిని శ్రీపంచమి రోజు ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయి అనే నమ్మకం అనాదిగా వస్తుంది. మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ. పూర్వేహి సమయం కృత్యాతత్రాహ్న సంయత సూచి అంటూ పూజిస్తూ విద్య ప్రారంభిస్తారు. అయితే తొలిగా వినాయకున్ని పూజించి చదువుల తల్లి శారదాంబ ప్రతిమను,పుస్తకాలను విద్యకు సంబంధించిన ఇతర వస్తువులను పూజించాలి. షోడశోపచారాలతో సరస్వతి మాతను పూజించి తల్లిని కుసుమాలతో, సుగంధద్రవ్యాలను రంగరించిన చందనంతో,శుక్ల వస్త్రాలతో అర్చించాలి. ఈ సంప్రదాయం ఉత్తరాదిన ప్రారంభమై దక్షిణానికి వ్యాపించింది. సాధారణ దేవాలయాల్లో సరస్వతి దేవిని మూడురోజులు పూజలు జరిపితే ఇంద్రకీలాద్రి, బాసర జ్ఞానసరస్వతీ ఆలయాల్లో ఐదురోజులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. సరస్వతీ దేవికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. అపారమైన వాజ్మయాన్ని, తత్వాన్ని, జ్ఞానాన్ని, ఈ తల్లి కృపచేతనే పొందినట్లు ఆదిశంకరాచార్యుడు అనేక సందర్భాల్లో ఉద్ఘాటించారు. అలాగే శారదా మాత అనుగ్రహంతోనే విద్య,విజ్ఞానాల్లో నిష్ణాతులవుతారనేది భక్తుల నమ్మకం. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారదాదేవి. అందుకే వసంత పంచమి రోజు సరస్వతి దేవిని ఆరాధిస్తే జ్ఞానవంతులవుతారనే నమ్మకం అనాదిగా వస్తుంది. పూర్వం యాకుందేందు.. అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువులు ప్రారంభమయ్యేవి. ఎందుకంటే చదువులతల్లి సరస్వతీ వాక్కు జ్ఞానానికి ప్రతీక. వేదాల్లో ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా సరస్వతిని