Question :-
మీ పుట్టిన రోజు ఎలా జరుపుకున్నారో మి మిత్రునికి లేఖ రాయండి.
No spammers
Spammers will be reported
Answers
లేఖ
××××××××,
31-01-2022.
ప్రియమైన స్నేహితుడు శ్రీకాంత్ కు,
శ్రీకాంత్ ఈ నెల 10 వ తారీకున నా పుట్టిన రోజు చాలా బాగా జరుపుకున్నాను.
పుట్టిన రోజు ముందు రోజు మా నాన్న గారు నాకు నచ్చిన కొత్త దుస్తులు నన్ను బట్టల దుకాణానికి తీసుకువెళ్లి కొన్నారు . అలాగే కేక్ తయారీ కొట్టుకి తీసుకువెళ్లి నాకు నచ్చిన కేక్ ను కొన్నారు , నా మిత్రులకి ఇవ్వడానికి చాక్లెట్లు, బిస్కెట్లు కొన్నారు.
నా పుట్టున రోజున ప్రొద్దున్నే లేచి తల స్నానం చేసి , కొత్త బట్టలు ధరించి వచ్చి మా అమ్మ నాన్న ల పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ దీవెనలు అందుకున్నాను .
దేవుని పటానికి వందనాలు చేసాను. బంధు మిత్రులు అందరి సమక్షంలో కేక్ ను కోసి అందరూ పుట్టిన రోజు పాట పడుతుండగా చాలా ఆనందంగా అందరికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చాను. చాలా మంది నాకు చాలా బహుమతులు ఇచ్చారు. ఆరోజూ నేను చాలా సంతోషపడ్డాను. నీవు వేరే ఊరు లో ఉండటం వల్ల రాలేకపోయావని తెలుసుకుని భాదపడ్డాను. అందుకే ఈ లేఖ నీకోసం రాస్తున్న.
ఈసారి మనము కలుసుకుందాం.
ప్రేమతో నీ మిత్రుడు.
ఇట్లు
నీ ప్రియమైన,
రాజు
చిరునామా:
శ్రీకాంత్,
దేవాలయం వీధి,
మెయిన్ రోడ్,
×××××××××,
పిన్ కోడ్:××××××,