Raithulu mana Annadhathalu Samarpisthu రాయండి
Answers
మభ్యపెడుతున్నాయి. అలుపెరుగని శ్రామికుల్లా రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారిని బిచ్చగాళ్ళుగా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సంఘటితమై ఉద్యమించవలసిన తక్షణావసరం నేడు ఎదురయ్యింది. ప్రభుత్వ విధానాలు ఏ రాజకీయ పార్టీ నాయకులకో సంబంధించినవి కావు. దేశంలో, రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిపై ప్రతి ఒక్కరూ జాలి ఒలకబోస్తున్నారు. కాని కనికరం లేని ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టడంలో కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి. అందుకే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, రైతాంగ సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, వ్యవసాయ రంగంపై జాతీయ స్థాయి చర్చ జరిగేలా చేశారు. ఆయన చేపట్టిన దీక్షకు పది పన్నెండు జాతీయ స్థాయి పార్టీల నేతలు మద్దతు తెలిపి రైతుల ఇబ్బందులపై దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది మన రాష్ట్రంనుంచి మొదలు కావడం హర్షించదగిన పరిణామం.
Hope this answer helps you. Please mark me as brainliest
వ్యవసాయం మన సంస్కృతికి పునాది. ఆ విషయం మనం మరువకూడదు. అదొక రకమైన అద్భుతం. మనం నడుస్తున్న మట్టినే మనం ఆహారంగా మనం మార్చగలుగుతున్నాం. నేను చెబుతున్నదేమిటో మీకు అర్థం కాక పోతే ఈ రాత్రి మీ భోజనంలో పచ్చడికి బదులు ఒక ముద్ద మట్టిని పెట్టుకుని అది నంజుకుంటూ అన్నం తినండి. మట్టి తినడం ఎంత కష్టంగా, ఘోరంగా ఉంటుందో చూడండి. మరి మనం తినలేని ఆ మట్టినే మనం మధురమైన, పోషణ నిచ్చే ఆహారంగా, మన కండ, నెత్తురును తయారు చేసే ఆహారంగా చేసుకుంటున్నాము. అదేమీ చిన్న విషయం కాదు.
మట్టిని ఆహారంగా మార్చే ప్రక్రియను వ్యవసాయం అంటాము. ఈ అద్భుతమైన ప్రక్రియను వృక్ష సంపదను గమనించి దానిని ఉపయోగించుకోవడంతో కనుగొన్నాము. మీరు కాలేజీలో ఉన్నారు కాబట్టి నేను చెప్పిందాంట్లో తప్పేమన్నా ఉంటే సరిచేయవచ్చు, నాకు తెలిసినంత వరకు, దక్షిణ అమెరికాలోని ఏవో కొన్ని ప్రాంతాలు తప్ప, మరెక్కడా పన్నెండు వేల ఏళ్ళకు పైబడిన వ్యవసాయ సంస్కృతి లేదు. ఈ దక్షిణ భారతంలో తమిళనాడులో పన్నెండు వేల ఏళ్లకు పైగా మనం అదే భూమిని మనం దున్నుతున్నాం. అమెరికాలో మట్టిని ‘మలినం’ అంటారు, కాని మనం మాత్రం దీనిని భూమాత అంటున్నాం, ఎందుకంటే మనకు భూమితో ప్రగాఢమైన సంబంధం ఉంది.