Raju baaga chadhivi parisksha raasadu - a rakamayina samslishta vakyam
wrong and unnecessary answer will be reported
Answers
సమాధానం :
క్త్వార్థక వాక్యం
వివరణ :
సంశ్లిష్ట వాక్యం (Complex sentence) : ఒకే వాక్యంలో సమాపక క్రియ, అసమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.
సంశ్లిష్ట వాక్యం రకాలు :
1. చేదర్థక వాక్యం : [ చేదర్థకం = తే, అయితే ]
ఒక పని ఇంకో పనిపై ఆధారపడి జరుగుతుంది.
ఉదాహరణ :
వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
2. శత్రర్థక వాక్యం : [ శత్రర్థకం = తూ ]
ఒక పని చేస్తూ ఇంకో పని చేయటం.
ఉదాహరణ :
స్నేహిత సినిమా చూస్తూ ఏడుస్తుంది. ( సినిమా చూస్తుంది + ఏడుస్తుంది )
3. అప్యర్థక వాక్యం : [ అప్యర్థకం = ఇనా ]
ఉదాహరణ :
ఆమె వివరించినా నాకు అర్ధం కాదు.
4. క్త్వార్థక వాక్యం : [ క్త్వార్థకం = ఇ ]
ఉదాహరణ :
సుష్మ రోజూ అభ్యసించి పోటీలో గెలిచింది.
__________________
ఇచ్చిన వాక్యం :
రాజు బాగా చదివి పరీక్ష రాశాడు.
ఈ వాక్యములో చదివి అనే పదం లో 'ఇ' ప్రత్యయం ఉంది. కాబట్టి ఇది క్త్వార్థక వాక్యం అవుతుంది.