Environmental Sciences, asked by prashanthilingaredy, 10 months ago

rose flowers write 6lines in telugu​

Answers

Answered by BhuvanaBudati
2

గులాబీ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. అందరి కీ మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. గులాబీ పువ్వులని అన్ని పువ్వులకి రాణి అని అంటుంటారు. వాటిలో మెత్తని మృదువైన స్వచ్చమైన రంగుతో నిండిన చక్కని వంపులతో ఉండే పూరేకులు వాటి ఆకర్షణ. గులాబీ పూలకి మంచి సువాసన ఉంటుంది.

గులాబీలు ఎన్నో రంగులలో కనిపిస్తాయి. ఎరుపు, పసుపు, పింకు, గులాబీ రంగు, తెలుపు, నారింజరంగు, పీచ్, కోరల్, మరియు లావెండర్ కూడా. వీటి రంగులు హైబ్రిడ్ రకాల వల్ల వస్తాయి. లేత రంగులు మరి ముదురు రంగులలో కూడా మనకు కావలసిన విధంగా దొరుకుతాయి. కానీ వీటిని పెంచడం, తోట వ్యవసాయం చేయడం అంతా సులభం కాదు. చల్లని ప్రదేశంలోను, నీళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశంలోను పెరుగుతాయి. క్రిమి కీటకాలనుండి జాగ్రత్తగా రక్షిస్తూ పెంచాలి.

గులాబీ ని ప్రేమకి అహింసా, శాంతిలకి గుర్తు గా వాడతారు. పండిట్ నెహ్రూ గారు ఆయన కోటు పై జేబులో రోజూ ఒక గులాబీని ఉంచేవారు. ప్రేమికులు తమ ప్రేమని ప్రేమికురాలతో చెప్పడానికి, సారీ అని అడిగేటప్పుడు గులాబీలని ఇస్తారు.

గులాబీలు అందమే గాని, వాటి కొమ్మలపైనా ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ముట్టుకోవాలి, పట్టుకోవాలి తరవాత కోయాలి. గులాబీలు ప్రేమికుల రోజు చాలా ఎక్కువ గా అమ్ముడవుతాయి. గులాబీలని పెళ్లిళ్లలో అలంకరించద్దానికి, ఇంట్లోను, గుడిలోను పూజలు చేయడానికి ఎక్కువగా వాడతారు. గులాబీలని మందులలో కూడా వాడతారు. పెర్ ఫ్యూమ్ తయారు చేయడానికి కూడా వాడతారు. గులాబీ నీరు ఆరోగ్యానికి మంచిది. గులాబీ నీటిని కొన్ని పిండివంటలు, ప్రత్యేకమైన వంటలలో కూడా వాడతారు. ఎవరైనా పెద్దవాళ్లని ఆహ్వానించేటపుడు, ఫూలగుచ్చాలు ఇచ్చేటపుడు, దేవునికి గులాబీపువ్వులతో దండ వేస్తారు.

గులాబీల శాస్త్రీయ నామం "రోజా (రోసా) ఇండికా". వీటిల్లో ఒక వంద జాతులు ఉన్నాయి. వేయి కనా ఎక్కువ రకాలునాయి. ఇవి ముఖ్యం గా ఆసియా లో పెరుగుతాయి. కొన్ని రకాలు వేరే ఖండాలలో కూడా పెరుగుతాయి. ప్రతీకొమ్మలోను అటు ఇటు ఒక్కొక ఆకు ఉంటుంది. కొమ్మ చివరన ఒక ఆకుంటుంది. చాలా గులాబీ పువ్వు జాతులలో ప్రతీ పువ్వులో ఐదు రేకులుంటాయి

mark this as brainliest

Answered by anantnakshat
0

Answer:

Explanation:

Read more on Brainly.in - https://brainly.in/question/13240532#readmore

Similar questions