Psychology, asked by saicreations369, 1 year ago

samajaabhivtuddhilo yuvaths patra essay in telugu​

Answers

Answered by riddhi12328
0

Answer:

గత పదేళ్లతో పోలిస్తే నగరంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే యువత శాతం పెరిగింది అంటున్నారు సామాజిక వేత్త రామచంద్రయ్య. నిజమే! చాలా వరకూ యువత సంఘటితమై సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిరుడు నగరంలో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు దుర్ఘటనలో కూడా క్షతఘాత్రులను ఆసుపత్రులకు చేరవేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు. చారుధామ్‌ వరద బీభత్సం, నేపాల్‌ భూకంపం...వంటి పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైతం యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు పోగుచేసి అన్నార్థులను ఆదుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ విపత్తు సంభవించినా సాయం చేయడానికి, అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి యువతరం ముందే ఉంటుందనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి.యువత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పరిణామం. అయితే ఈ సంఖ్య మరింత పెరగాలి. వారు కేవలం సమాజంలోని కొన్ని సమస్యలను మాత్రమే స్పృసించడం కాదు...రాజకీయ, ఆర్థిక విధానాల్లో సైతం భాగస్వామ్యం వహించాలి. సామాజిక స్పృహతో ముందుకు నడవాలి. అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తులవ్వాలి.

please mark as brainlist

Similar questions