India Languages, asked by nitya4596, 1 year ago

sarvepalli radhakrishnan matter in telugu

Answers

Answered by PADMINI
3

Answer:

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు దగ్గర తిరుత్తణిలో జన్మించారు.

ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. మాతృభాష తెలుగు.

ఆయన బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు.

సర్వేపల్లి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు.

1906లో తన 16వ ఏట ఆయనకు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు.

రాధాకృష్ణన్‌ విద్యార్థికి, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు .

సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచారు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నాం.

Similar questions