India Languages, asked by duppatisunilkumards, 5 months ago

నన్నయ్య గురించి రాయండి. say in telugu.​

Answers

Answered by itzHitman
34

Explanation:

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు.[ఆధారం చూపాలి] అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.

నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.

ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. నన్నయ భారతంలోని అత్యుత్తమ, అత్యంత అభివృద్ధి చెందిన భాషను గమనిస్తే, నన్నయ భారతానికి పూర్వమే తెలుగు సాహిత్యంలో రచనలు ఉండి వుంటాయన్న సూచన కలగుతుంది. నన్నయకు ముందేవున్న పద్యశాసనాల్లోని పద్యాలు, అనంతరకాలంలోని పాల్కురికి సోమన రచనలో సూచించిన అనేక ప్రక్రియల సాహిత్యరూపాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కవిప్రశంసలు

Answered by akshuasmitha
7

Answer:

నన్నయ్య గురించి రాయండి. say in telugu.

Similar questions