say the essay on pigon in telugu
Answers
పావురం ఒక అందమైన
పక్షి. పావురాలు బలిసిన శరీరం కలిగిన దేశీయ
పక్షులు. అవి చిన్న మెడను, మాంసపు ముక్కును కలిగి ఉంటాయి. పావురాలు
కొలంబిడే అను జాతికి చెందినవి. అవి ప్రధానంగా పాలకూర, కూరాకు, చిక్వీడ్, క్లోవర్, వాటర్క్రెస్స్, బెర్రీలు, ఆపిల్, బేరి పండ్లు, మొదలగునవి తినును. ప్రపంచంలో చాలా రకాల
పావురాలు కలవు. అవి పుల్లలతోను, శిధిలాలతోను గూడు నిర్మించుకుని అందులో
నివసిస్తాయి. అవి సాధార్నంగా భవనాల చూరులో వాటి గూడును కట్టుకొనును. అవి సాధారనంగా
చిన్న చిన్న కొమ్మలతో గూడును నిర్మిస్తాయి.
పావురాలు ఒక
సారికి ఒకటీ లేదా రెండు గుడ్లను పెట్టును. ఆడ మరియు మగ పావురాలు రెండూ పిల్లల
సంరక్షనను చూడును. వాటి పిల్లలు 7 నుండి 28 రోజులలో గూడును వదిలిపెట్టి బయటకు వెళ్తాయి.
ఇతర పక్షుల వలె కాక మగ మరియు ఆడ పావురాలు రెండూ పాలను ఉత్పత్తి చేస్తాయి. చిన్న
పావురాలను స్క్వాబ్స్ అని పిలుస్తారు.
పావురాల గురించి
కొన్ని విషయాలు
·
పావురాలు చాల
తెలివైన పక్షులు. వాటిని గుర్తించుకోగల పక్షులు పావురాలు. అంతే కాకుండా అవి మనుషుల
అక్షరాలను కూడా గుర్తించగలవు, రెండు పేరాల మధ్య భేధాన్ని గుర్తించగలవు, మరియు ఫొటొలో
వివిధ వ్యక్తులను గుర్తించగలవు.
·
పావురాలను
ప్రాచీన కాలంలో సందేశాలు పంపించడానికి ఉపయోగించెవారు.
·
పావురాలు వారి
అసాధారణ సంచార సామర్ధ్యాలకు ప్రసిద్ది. సూర్యున్ని అంతర్గత దిక్షూచి గాను, ఇంకా మొదలగు
నైపుణ్యాలను ఉపయోగిస్తాయి. పావురాలు అత్యంత స్నేహశీలియైన జంతువులు. అవి తరచుగా 20-30 పక్షుల మందలుగా
కనిపిస్తాయి. పావురాలు అద్భుతమైన వినికిడి సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. మనుషులు
వినగలిగే శబ్దాల కన్నా తక్కువ పౌనఃపున్యాల శబ్దాలు అవి వినగలవు. అందువల్ల సుదూర
తుఫానులు మరియు అగ్నిపర్వతాల శబ్దాలను అవి వినగలవు.
పావురాలు 6000 అడుగుల ఎత్తు
వరకు ఎగరగలవు. అవి గంటకు 77 మీటర్ల వేగంతో పయనించగలవు.
పావురాలు
ముస్లింలు, హిందువులు మరియు సిక్కులు సహా వివిధ మతాల వారి చేత ఆధ్యాత్మిక కారణాల కోసం
పోషించబడతాయి.