India Languages, asked by VINEET1689, 1 year ago

short city life poems in telugu

Answers

Answered by tanya591
1
ఇదే  ఇదే  మన  అందాల  పట్టణం
ఎందుకో  అదంటే  నాకెంతో చాలా ఇష్టం
ఇక్కడ  బ్రతకడం లో ఉంది ఇసుమంత కష్టం
ఎందుకంటే  అవుతోంది ఇది రోజు రోజుకీ భ్రష్టం !?

పెద్ద పెద్ద   భవనాలే  అన్నీ  అటూ  ఇటూ
అందులో చిన  చిన  గూళ్ళల్లో నివాసముంటూ
డబ్బు సంపాదనకు పరుగు లిడుతుంటూ
బ్రతికేయడమేరా ఈడ జీవితం ఓ  చింటూ !

వానలొస్తే అక్కడ అక్కడ  నీళ్ళ గుంటలు  
రోడ్డెక్కితే  దుమ్ము ధూళి పొగలు సెగలు
అంటూ చిక్కని నాయకుల  రాజకీయాలు 
రోజు రోజు కీ పెరిగే నిత్యవసర వస్తు ధరలు  !?

వేసవి లొ చిమ చిమలాడించే ఎండలు
ఆఫీసులకి  ప్రొద్దుటినుండే పరుగులు
విసుగు  కలిగిస్తాయి కరెంటు కోతలు
మంచి నీళ్ళకోసం ముప్పు తిప్పలు

పిల్లలందరి కళ్ళల్లో  ఎన్నెన్నో ఆశలు
ఎటు చూసినా సినిమాలు  వినోదాలు
చదువుల కోసం  పడతారు  చాలా పాట్లు
బ్రతికేస్తాం  అందరం భరిస్తూ ఎన్నయినా ఇక్కట్లు
సంపాదిస్తూ ఇంకా ఇంకా  కాసులు  డబ్బులు 
Similar questions