India Languages, asked by tdprajapati5899, 11 months ago

Small essay about Pongal in Telugu

Answers

Answered by dreamrob
2

పొంగలి పండుగ గురించి ఒక చిన్న వ్యాసము:

పొంగలి పండుగ రైతులు తమ పంట చేతికి వచ్చిన కారణం చేత దీన్ని జరుపుకుంటారు. ఈ పండుగ జనవరి నెలలో మధ్యలో వస్తుంది. దీని తమిళ్ నాడు ప్రజలు చాలా ఇష్టంగా జరుపుకుంటారు.

ఈ పండుగను నాలుగు రోజులు జరుపుతారు. ఈ పండుగ రోజున పిల్లలు పెద్దలు అందరూ కలిసి కొత్తబట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. కట్టె పొంగలి అనేది ఒక ప్రత్యేకమైన వంటకము. దీనిని పొంగలి రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు పొంగల్,మూడో రోజు బట్టు పొంగలి,నాలుగో రోజు కనుమ పొంగలి.

ఈ పండుగ రోజు ఉదయాన్నే అందరూ నిద్ర లేచి తలస్నానాలు చేసి దేవుడికి పూజలు చేస్తారు. ఈ పండుగ రోజు ఉదయం పాలు పొంగించడం ఒక ఆనవాయితీ. తమ తమ ఇళ్లను రకరకాల పువ్వులతో అలంకరణ చేస్తారు. చెరుకుగడలు తినగానే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం.

ఈ పండుగ రోజున రైతులు తమ సంతోషాన్ని స్వీట్స్ ఇవ్వటం ద్వారా తెలియజేస్తారు. చాలామంది ఈ పండుగ వస్తుంది అని అనగానే తమ తమ సొంత ఊర్లకు ప్రయాణమై వెళ్తారు. అక్కడ తమ కుటుంబ సభ్యులతో మరియు బంధు మిత్రులు తో కలిసి ఆనందంగా పండుగను జరుపుకుంటారు.

Similar questions