Geography, asked by gssidhu8529, 1 year ago

Speech about idepedence day in Telugu

Answers

Answered by Anonymous
0

మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము.

Monday, August 16, 2010

Independence Day of India , భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం





స్వాతంత్ర్య దినోత్సవం--ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.


బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.


ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.




కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

================================

Answered by TrueRider
66

స్వాతంత్ర్య దినోత్సవం:-

ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంద

Similar questions