Sri Ramudu gurinchi in telugu
Answers
Answer:
శ్రీరాముడు ఎప్పుడు, ఏ సమయంలో పుట్టాడో తెలుసుకోండి..
Sri rama navami | శ్రీరామ నామం మధురం.. రూపం మధురం.. గమనం మధురం.. హృదయం మధురం.. మధురాధిపతి శ్రీరాముడి వచనం, చరితం మధురం..ఇలా చెప్పుకుంటూ పోతే రూపం నుంచి .. ఆయన గుణగణాలన్నీ మధురమే.. సుపుత్రుడికి నిలెవుతు నిదర్శనం శ్రీరాముడు.. ఆ రాముని జననం గురించి తెలుసుకోవాలంటే..
శ్రీరాముడు ఎప్పుడు, ఏ సమయంలో పుట్టాడో తెలుసుకోండి..
తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరాముడికి పేరు. ఏకపత్ని వ్రతుడు.. పెద్దలను గౌరవించడం ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన చరిత భావితరాలకు స్పూర్తిదాయకం. రామయణం కాల్పనిక పాత్ర అని కొంతమంది అన్నప్పటికీ.. వాటన్నింటిని కొట్టేస్తూ కొడుకు అంటే ఇలా ఉండాలంటూ ఇప్పటికీ ఆయన గురించి చెబుతుంటారు. అలాంటి రాముడి జననం గురించి అందరికీ తెలియకపోవచ్చు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడు అని చెబుతుంటారు. అయితే, ఇది ఓ అంచనా మాత్రమే.. కానీ ఈ విషయాన్ని కనుగొనేందుకు ఇటీవలే ఇద్దరు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధన చేశారు. భారతీయ రెవెన్యూ సర్వీస్(IRS)లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఈ ఇద్దరూ కూడా పురణాలనీ, జ్యోతిష్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశోధన చేశారు. ఇందులో శ్రీరాముడు క్రీ.పూ 5114 సంవత్సరం, జనవరి 10 మధ్యాహ్నం 12:05గా తేల్చారు.
శాస్త్రవేత్తలు ‘ప్లానెటోరియం’ అనే సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఏ రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని శ్రీరాముడి జననం గురించి చెప్పారు. కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారని.. ఆయన జన్మ సమయంలో సూర్యుడు మేషంలోను, కుజుడు మకరంలో ఉన్నాడని తెలిపారు