surpanaka patra swabavam explain cheyandi
Answers
Answer:
even iam telugu
Explanation:
శూర్పణఖ (సంస్కృత: शूर्पणखा, IAST: śūrpaṇakhā,) అనగా వాల్మీకి రామాయణంలో ఒక పాత్ర, రామాయణంలోని ముఖ్యమైన పాత్రలలో శూర్పణఖ ఒకటి.వాస్తవానికి రావణుడి నాశనానికి దారితీసే సంఘటనల గొలుసును ప్రారంభించిన బాణంలాంటిది శూర్పణఖ పాత్ర.ఈమె రావణ బ్రహ్మ సహోదరి.[1] రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది. రాముని తమ్ముడైన లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేస్తాడు. రావణాసురుడు రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.ఈమె తండ్రి రామాయణంలో వివరించిన విధంగా విశ్రావుడు.ఇతను ఒక రుషి. అగస్త్య ముని సోదరుడు, సృష్టికర్త బ్రహ్మ మనవడు,శక్తివంతమైన రుషి కుమారుడు.పండితుడు,అతను తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదిస్తాడు.అది అతనికి గొప్ప పేరును సంపాదించింది.ఇతని భార్య కైకాసి అనే అసుర మహిళ. విశ్రావుడు,కైకసి దంపతులకు రావణుడు, శూర్పణఖ కాక వీరికి విభీషణ, కుంభకర్ణ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.విశ్రావుని మరొక భార్యకు జన్మించిన కుబేరుడు శూర్పణఖ అర్ధ సోదరుడు.[1]విశ్రావుడు, అతని రెండవ భార్యకు జన్మించిన శూర్పణఖ పుట్టినప్పుడు " మీనాక్షి " (చేప కన్నులుగలదని అర్థం) అనే పేరు పెట్టారు.అమె దుష్టబుద్ధిగల రాక్షసుడుని వివాహమాడింది.మొదట్లో శూర్పణఖ భర్త, తన సోదరుడు,లంకరాజైన రావణుడితో అధిక అభిమానాన్ని సంపాదించాడు.అతను ఆ కారణంతో రావణుడి ఆస్థానంలో విశేషమైన సభ్యుడుగా వ్యవహరించాడు. అయితే దుష్టబుద్ధి కలిగిన అసురుడు మరింత అధికారం కోసం కుట్రపన్నాడు.ఆసంగతి రావణుడు తెలుసుకుని దుష్టబుద్ధిని చంపాడు.అన్న తన భర్తను చంపినందుకు శూర్పణఖ చాలా అసంతృప్తి చెందింది.వితంతువు శూర్పణఖ లంక, దక్షిణ భారతదేశంలోని అరణ్యాల మధ్య గడిపింది.అలా అరణ్యాల మధ్య తిరుగుతూ అసుర, అటవీ నివాస బంధువులను సందర్శిస్తూ కాలం గడుపుతుంది.వాల్మీకి రామాయణం ఆధారంగా అటువంటి ఒక సందర్శనలో, ఆమె పంచవటి అడవిలో రాముడిని చూస్తుంది.[1]చూసిన వెంటనే వితంతువుగా ఉన్న ఆమె మనస్సులో రాముడిపై ప్రేమలో కలిగింది.ఆమె రాముడిని కావాలని కోరుకుంటుంది.ఆమెకు ఉన్న మాయ అనే శక్తిని ఉపయోగించుకునే అందమైన మహిళగా తనను తాను ముసుగు చేసుకుంటుంది. ఆమె రాముడు దగ్గరకు వచ్చి అతని పాదాలను తాకి నమస్కరించింది. రాముడు ఆమెను ఎవరు నీవు అని మూలం గురించి ఆరా తీస్తాడు. ఆమె బ్రహ్మ మనవడి కుమార్తె అని, కుబేరుడు ఆమె సోదరుడని, శూర్పణఖ చెప్పింది. ఆ తరువాత ఆమె రాముడు సౌందర్యాన్ని గురించి పొగిడి,ఆమెను వివాహం చేసుకోమని కోరింది.దానికి రాముడు తాను ఇప్పటికే వివాహం చేసుకున్నానని, తాను " ఏకపత్నీవ్రతుడు " నని అంటే ‘ఒక భార్యకు మాత్రమే విధేయుడును’ అని రాముడు చెప్తాడు.[2]శూర్పణఖను తన సోదరుడు లక్ష్మణుడుని సంప్రదించమని చెపుతాడు. రాముడు ఏకపత్నీవ్రతుడైనందున ఇది జరిగేది కాదని ఉద్దేశ్యంతో, లక్ష్మణుడు తన ఆనందంకోసం, ఆమెను ఆటపట్టించాలని తాను రాముడు సేవకుడునని చెప్తాడు.అందువల్ల, ఆమె తన భార్యకు బదులుగా ఉండేకంటే, రాముడు రెండవ భార్యగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు.ఆ మాటలకు శూర్పణఖ కోపంగా మారి సీత గురించి అసభ్యంగా మాట్లాడింది.సీత రక్షణకు వచ్చిన లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. లక్షణుడు చేత పరాభవం చెందిన శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవటానికి మొదట తన సోదరుడు వద్దకు వెళ్లి, రాముడిపై రక్షా యోధులుపంపి దాడిచేసింది.వీరంతా చంపబడ్తారు.ఆమె నేరుగా అన్న రావణుడి ఆస్థానానికి వెళ్లి, జరిగిన సంఘటన గురించి శూర్పణఖ తన సోదరుడు రావణడుకి ఫిర్యాదు చేసింది. ప్రతీకారం తీర్చుకోవడంలో రావణుడి సహకారాన్ని పొందటానికి సీత, అందాన్ని గురించి కీర్తించడం ద్వారా, సీతను రావణుడికి తగిన భార్యగా ప్రశంసించడం, బలవంతంగా ఆమెను అపహరించి వివాహం చేసుకోవాలని అతన్ని ప్రేరేపించి, రావణుడుకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతను సీతను కలిగి ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతను సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు.[3] రావణుడు తన సోదరుడు విభీషణ వారించిననూ సీతను మోసంతో అపహరించి రాముడుతో యుద్ధానికి కారణమవుతాడుదీని ప్రకారం, ఆమె రావణుడుని ప్రేరేపించి రావణుడిచే సీతను కిడ్నాప్ చేయించి, ఫలితంగా రావణుడు, రాముడుల మధ్య జరిగిన యుద్ధం, ఆమె సోదరుడిని చంపాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ప్రణాళికలు వేసినట్లుగా ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.[2]
Answer:
అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు పంచవటిలో రుషులతో కలిసి వేదశాస్త్రాల గురించి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాడు. ఈ సమయంలో శ్రీరామచంద్రుని కవ్వించి రాక్షస సంహారానికి బీజం వేసింది శూర్పణఖ. దండకారణ్య స్థిత సమస్త రాక్షసుల చావునకు, ఖరదూషణల ఈమె మరణానికి కారణభూతమైంది. అక్కడ నుంచి లంకకు చేరి ఆ నిప్పును అక్కడ అంటించడమే కాదు, సీతాదేవిపై తన అన్న రావణుడికి వ్యామోహం కలిగేలా చేసింది. రావణుని పంచవటికి రప్పించి, సీతను అపహరించేలా చేసి చివరకు పౌలస్త్యవథకు కూడా హేతువైంది.శూర్పణఖ అసలు పేరు మీనాక్షి.. కేకసి, విశ్రావసుల కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర దూషణలకు సోదరి. మారీచ, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యజ్జిహ్యుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరబాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు 'తెలియక తప్పు జరిగిపోయిందని' ఓదార్చాడు. మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు, దండకారణ్యానికి మధ్య తిరుగుతూ కాలం వెల్లదీస్తుంది.
రావణ సంహారమే రామాయణమైతే, శ్రీరాముడు రఘవీరుడైంది రాక్షస సంహారంతోనే ఇదంతా శూర్పణఖ వల్లే జరిగింది. ఒక్క తాటికి, సుబాహు తప్ప మిగతా వారి మరణానికి కారణమైంది. అంతేకాదు వారికి అభివృద్ధి కూడా తోడ్పడింది ఆమే. ఎలా అంటే విభీషణస్తు ధర్మాత్మా అంటూ మొట్టమొదటి సారిగా రాముడి వద్ద విభీషణుడి పేరును ప్రస్తావించి, ఆయనపై శ్రీరామునికి సదాభిప్రాయం కలిగించింది కూడా ఈ మీనాక్షే.
దండకారణ్యంలో నరవాసన తగలి పరుగెత్తుకొచ్చిన ఈమె, రాముడి దర్శనంతో ఆకలిని సైతం మరిచిపోయి, కామ వికారిగా మారి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేయిందుకోవాలని ఆశించింది. అందుకు సీతను చంపడానికి కూడా సిద్ధపడింది. శూర్పణఖను రాక్షస స్త్రీగా వాల్మీకి వర్ణించినా, కంబ రామాయణంలో మాత్రం ఆమెను అందగత్తెగా చిత్రీకరించారు. సీతను చంపడానికి ఉద్యుక్తురాలవుతోన్న శూర్పణఖను తన అన్న శ్రీరాముడి ఆఙ్ఞతో లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి వదిలిపెట్టాడు. అయితే ఈ శూర్పణఖ పూర్వ జన్మలో ఓ గంధర్వ కన్య. వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడటానికి ఓ రోజు ఈమె ప్రయత్నించింది. ఈ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు. దీనికి ఆగ్రహించిన ఆ గంధర్వ కాంత శేషుడి చెవులు, ముక్కుమీద పొడించింది.
ఆమె చేసిన పనికి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేయగా, లక్ష్మీతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఆమె భర్త అక్కడకు వచ్చి భార్యను కసురుకుని భూలోకంలో రాక్షసిగా జన్మించమని శపించాడు. దీంతో ఆమె లక్ష్మీదేవిని కూడా శపించింది. కాలాంతరమున నా కారణంగా నీకు భర్తతో వియోగం సంభవిస్తుందని శాపం ఇచ్చింది. ఆ గంధర్వాంగనే శూర్పణఖ.. ఆదిశేషుడే లక్ష్మణుడు. అలాగే తన భర్తను రావణుడు సంహరించాడనే కోపంతోనే రాక్షసనాశనం గావించింది. అంటే భారతంలో శకుని కోపం లాంటిది శూర్పణఖ ఆక్రోశం. చిన్న పాత్రే అయినా రామయణం మొత్తానికి ప్రధానమైన నిలిచింది.
శ్రీవారి సేవలో కెన్యా మాజీ ప్రధాని
తరవాత కథనం
మరింత సమాచారం తెలుసుకోండి
శ్రీరాముడుశూర్పణఖరావణుడురామాయణంలో శూర్ఫణఖSurpanakharavana sister surpanakhaRamayanamLord RamaGodess lakshmi
Web Title : untold story of surpanakha in ramayana
Telugu News from Samayam Telugu, TIL Network
Telugu NewsReligionHinduismUntold Story Of Surpanakha In Ramayana