swacch bharat poems in telugu
Answers
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 14623 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్చ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.