Swacch bharath telugu 150 words
Answers
స్వచ్చ భారతం అనే కార్యక్రమం మన భారత ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడి గారు 2014 సం. అక్టోబర్ 2 న మొదలు పెట్టారు. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. శ్రీ మోడి గారే స్వయం గా ఢిల్లీ లో రోడ్డు ని ఊడ్చి శుభ్రం చేసి అందరికి మార్గదర్శకులయ్యారు. మహాత్మా గాంధి గారు భారత వాసులందరూ శుభ్రం, శుచి మరి ఆరోగ్యం గురించి బాగా తెలుసు కోవాలని, మరియు అశుభ్రం అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమం గాంధీ గారి కలని నిజం చేయాలని చేపట్టారు. ప్రజలందరూ ఇళ్లని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే పద్ధతులు వాళ్ళకు తెలియ చెప్పడం కోసం, కొంత వరకూ శుభ్రం చేయడం ఆ మిషన్ ముఖ్యోద్దేశం.
స్వచ్చ భారత్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి పౌరునికి ఆరోగ్యమైన మంచి నీటి వారింటి వద్ద కలిగించే సౌకర్యం చేయడం.
ఇండ్లలో ని తడి పొడి చెత్త ను రోడ్లప్రక్కన ఉన్న కుండీలలో వేస్తారు కదా, దాన్ని తొలగించి దూరాన వేరే ఉపయోగానికి తీసుకుపోవడం, గ్రామాలన్నీ శుబ్రంగా ఉండేలా చూడడం.
స్వచ్చ భారతం అన్నది పట్టణ మరియు మన కేంద్ర గ్రామాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది.
నిర్మల్ భారత్ అభీయాన్ మిషన్ పల్లెలలో మంచి శుభ్రమైన నీటికోసం మరియు శుభ్రత కోసం పని చేస్తుంది. వాళ్ళు వేలాది టోయిలెట్లు (మరుగు దొడ్లు) అవి లేని ఇళ్ళలోను, ఇంకా సామూహిక ప్రదేశాలలోను (మార్కెట్టు, సంత లలో ముఖ్యంగా) కడతారు.
ఇప్పటి దాకా కొన్ని లక్షల కొద్దీ మరుగు దొడ్లు అనేక గ్రామాలలో నిర్మించడమైనది. ఇంకా జరుగుతోంది. కొన్ని వేల కోట్ల రూపాయల ధనం ఖర్చు చేసారు.