Telangana vudyamam lo paalgonna eddaru mugguru mahilala vivaraallu sekarinchandi
Answers
Answer:
తెలంగాణ సాయుధపోరాటంలోనే కాకుండా భారత స్వాతంత్య్రోద్యమంలో కూడా తెలంగాణ మహిళలు పోషించిన పాత్ర అనన్యమైనది. గాంధీ నాయకత్వం కింద తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ జైలుకు వెళ్లారు. గాంధీ సత్యాగ్రహాన్నే గాక స్వదేశీ ఉద్యమాన్ని కూడా ఒక ఆయుధంగా ప్రయోగించారు. మహాత్ముడు నడిపిన అనేక ఉద్యమాలలో తెలంగాణలో అనేక మంది మహిళలు పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. నిజాం ఆంధ్రసభలతో పాటు ప్రత్యేకంగా మహిళా సభలు కూడా జరుగుతుండేవి. ఆరుట్ల కమలాదేవి జాతీయోద్యమంలో కూడా పనిచేస్తూ స్త్రీలలో చైతన్యం కలిగించడానికి కృషి చేశారు.మల్లు స్వరాజ్యం, జ్ఞానకుమారి హెడా, సంగెం లక్ష్మిబాయి వంటి ఎందరో మహిళలు సమరంలో పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యం: వెనుదిరగని పోరాట యోధు రాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలు పెరుగని ఉద్యమానికి ఆమె చిరునామా. నిజాం నవాబుకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్త గూడెం (కరివిరాల దగ్గర) వీరు పుట్టిన గ్రా మం. వీరికి పశు సంపద, 500 ఎకరాల పొలం ఉండేది. తల్లి నుంచి పోరాట విషయాలు తెలుసు కున్నారు. తుపాకీ పట్టి ఉద్యమాలు చేశారు. తెలంగాణ ప్రజ లు పడుతున్న బాధలను చూసి మరింత పట్టుద లతో పాల్గొన్నారు. పాటల రూపంలో ప్రజలకు ధైర్యం చెప్పేవారు. 1978లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి సి.పి.ఎం. అభ్యర్థిగా గెలు పొందారు. అసెంబ్లీలో జమీందారీ పాలనపైన, ప్రజల సమస్యల పైన వెనుతిరగని పోరాటాన్ని నిర్వహించారు. ఎంతో మందికి సేవ చేశారు.
కొండవీటి ఇందిరమ్మ: నల్లగొండ జిల్లా తాళ్ల వెల్లంల గ్రామంలో 5 అక్టోబర్ 1917న జన్మించిన వీరు వీధి బడిలో విద్యాభ్యాసం చేసి నీతిశాస్త్రం, రామాయణ, భారత, భాగవతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. భర్త కొండవీటి బుచ్చిరెడ్డి గొప్ప ఆదర్శవాది. క్విట్ ఇండియా ఉద్యమం నాటి నుండి ఆయన గాంధీజీ బోధనలకు ఆకర్షితు డయ్యాడు. కమ్యూనిస్టు నాయకుడైన భర్త ఆదేశం మేరకు ప్రజాహిత కార్యక్రమాలలో ఇందిరమ్మ పాల్గొనేవారు. బతుకమ్మ పాటలను స్వయంగా పాడి స్త్రీల కష్టాలను గూర్చి గ్రామాల్లో వెట్టి చాకిరి గురించి మహిళలను చైతన్యం పరిచేవారు. స్త్రీలకు జరిగే అవమానాలను ఎదిరించేవారు. ఆ సమ యంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన సైనిక దళాలు గ్రామాలపైకి వచ్చే రజాకార్లను తరిమేయ సాగారు. ఆ పార్టీ వారు వైద్య శిక్షణాలయాలను ఏర్పాటు చేసినారు. శిక్షణ పొంది పోరాటంలో క్షతగాత్రులైన పార్టీ కార్యకర్తలకు గ్రామీణ ప్రజ లకు వైద్య సేవలందించేవారు. 1948 సెప్టెంబర్ లో హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరి గాక కూడా ఇందిరమ్మను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. చాకచక్యంగా పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్ళి మూడు నెలల తర్వాత హైదరాబాద్ వచ్చారు. కుటుంబ పోషణకై ఉపాధ్యాయ వృత్తి 1949 నుండి 1953 వరకు చేసి, ఆ తర్వాత భర్తతో స్వగ్రామం తాళ్లవెల్లంలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసి దానికి బ్రాంచి పోస్టుమాస్టరుగా పనిచేసిన ఆమె కుమారుడు సమర యోధుడైన రాధాకృష్ణారెడ్డితో కలిసి జీవనం గడిపారు.
ఆరుట్ల కమలాదేవి: భువనగిరి దగ్గర గల మంథ పురిలో జన్మించిన ఈమె హైదరాబాద్‌లో స్థిరప డ్డారు. వీరి భర్త కమ్యూనిస్టు నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డిగారు. మెట్రిక్యులేషన్ వరకు చదివిన వీరు భర్తతో పాటు కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా చేరారు. విద్యార్థిగా ఉండగానే ఆర్యసమాజ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1942-1944 మధ్య కాలంలో హైదరాబాద్ మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తన జిల్లా నల్లగొండలో ఆంధ్రమహాసభ సభ్యురాలి గా ఉండి మహాసభ కార్యక్రమాలను ఉధృతం చేశారు. 1946-48 కాలంలో భూస్వామ్య విధా నానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్టు పార్టీ ఉద్యమం నిర్వహిస్తున్న రోజులలో అజ్ఞాతంలో ఉండి ఉద్య మ సాఫల్యానికి కార్యకర్తలకు తోడ్పడేవారు. రజా కార్ల ఆగడాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా పోరాట దళాలను ఏర్పాటు చేసి ఎదిరించారు. రజాకార్లు కమలాదేవి ఇంటిని లూటీ చేశారు. 1952 నుండి 1956 వరకు హైదరాబాద్ శాసన సభలో సభ్యులుగా ఉండి ఉత్తమ చట్టాలను తేవడా నికి కృషి చేసిన కమల 1957-62 లో మరో సారి శాసనసభలో సభ్యులు ఉండి మహిళాభ్యుద యానికి నిరంతరం కృషిచేశారు. నల్లగొండ జైలు లో 6 నెలలు, వరంగల్ జైలులో 6 నెలలు, ఔరం గాబాద్ జైలులో ఒక సంవత్సరం, సికింద్రాబాద్ జైలులో
Explanation:
I hope it's help you