India Languages, asked by reddyasvitha2006, 17 days ago

Telangana yasa lo maatlade sambhashana​

Answers

Answered by Teluguwala
8

తెలంగాణా యాసలో మాట్లాడే సంభాషణ :

రంగ : వారి, రాజుగా ! పొద్దుగల్ల ముసలమ్మ యామాయె.

రాజు : నేను 1098 నంబర్కి రూపాయి బిళ్ళేసి చెప్పిన.

రంగ : అయితే ఏమాయె. గా నంబత ఏమయితది.

రాజు : వారి నీకు ఆ ఇక్మత్ తెల్వదా. గా వాళ్ళ మోటర్ల అచ్చి గామెను తీస్కపొయిన్లు.

రంగ : యాడికి పొయిన్లు రా వారి అటెంక ఏమాయె.

రాజు : వారి అది "చైల్డ్ హెర్టైన్" గని ఎవరికి కష్టమొచ్చిన వస్తరు. సాయం చేస్తరు.

రంగ : గట్లయితే గా ముసలామెను దానఖాయేసిన్ర.

రాజు : ఆఁ గంతనేనా, గామె కొడుకుల పోలీసులు బట్క పోయిన్లు. మల్ల ఇంకొకడు అమ్మలను ఇంట్లకెల్లి ఎల్లగొట్టరు.

రంగ : వారి రాజు నీకు గింత ధైర్నం యాడిదిరా.

రాజు : గదేందిరా మన తెలుగు పంతులు జెప్పలె మొన్న. అపతిలున్నొల్లకు సాయం చేసుడే దేవునికిష్టమని జెప్పలే మర్సినావురా రంగ.

రంగ : భలె మంచి పని జేసినవుర రాజు. నీ అసుంటి దొస్తున్నందుకు మస్తుగున్నది నాకు.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

గమనిక :-

పరిసరాల్లో జరిగిన సంఘటనను వాడుకభాషలో సంభాషణగా వ్రాసాను.

# ధన్యవాదాలు ❣️

Similar questions