India Languages, asked by raotd, 10 months ago

TELL ME THIS ANSWER PLEASE IN TELUGU
CORRECT ANS=BRAINIEST.
WRONG ANS=REPORT.​

Attachments:

Answers

Answered by suggulachandravarshi
3

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం ఎంతో సంతోషకరంగా ఉంది.

ఇక నీ ప్రశ్నకు జవాబు విషయానికి వస్తే,

ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి అద్భుత సృష్టి స్త్రీలు.

స్త్రీ ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రలను సమర్ధవంతంగా అపూర్వంగా అద్భుతంగా నిర్వహిస్తుంది.

ప్రకృతిని, ప్రకృతిలోని ప్రతి యొక్క అందమైన విషయాన్ని స్త్రీతో పోలుస్తారు.

ఒక చదువుకున్న తల్లి వేల మంది ఉపాధ్యాయుల తో సమానం. అలాగే ఒక చదువుకున్న ఆడపిల్ల తాను ఎదగడమే కాకుండా తన పిల్లల్ని కూడా ప్రయోజకుల్ని చేసే అవకాశం ఉంటుంది. ఇది అందరూ తప్పక తెలుసుకోవాల్సిన పచ్చి నిజం.

ఒక స్త్రీ తన కుటుంబంలోని ప్రతి వ్యక్తి అవసరాలని సమర్థవంతంగా, వారికి నచ్చిన విధంగా తీరుస్తుంది. మానసికంగా బలంగా ఉన్న స్త్రీ ఎటువంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, "ఒక అబ్బాయికి విద్య నేర్పడం అంటే ఒక వ్యక్తికి మాత్రమే నేర్పడం అయితే ఒక అమ్మాయికి విద్య నేర్పించడం అంటే ఆ కుటుంబానికి మొత్తం చదువు చెప్పించడం." అని అంటారు నెహ్రూ గారు.

క దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలోని స్త్రీల యొక్క ర్వతోముఖాభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్షను లేకుండా చూడడం అనేది ఆ దేశంలోని ప్రతి పౌరుడు యొక్క బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.

అటువంటి సమసమాజం గల అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించగల సమయానికి స్వాగతం పలుకుదాం. నేటి మహిళలకు అభినందనలు తెలుపుదాం.

నా సమాధానం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను..

Similar questions