Telugu bhaasha goppatanam telupandi?
Answers
Answer:
తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలోనూ, భారత దేశంలో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల (2020) మందికి మాతృభాషగా ఉంది.ప్రాచీన దేశ భాషగా సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది.
ఇటలీ లోని వెనిస్ కు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి 15 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశం దర్శించి, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతం కలిగి) గా ఉండటం గమనించి, తెలుగును ప్రాచ్యదేశపు ఇటాలియన్ భాషగా( 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్) గా వర్ణించాడు.కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించాడు. కన్నడ అక్షరమాల తెలుగు భాష లిపిని పోలి ఉంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు తెలుగు భాషను పోలి ఉంటాయి.
తెలుగు భాష చరిత్ర:
తెలుగు, భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు.
క్రీస్తు పూర్వం 400 నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది.
ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు ఏనాదులు. పురాతత్త్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది.
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కాని తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి.కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'అని భావించారు కాని అది "నాగ బుద్ధ "అనే వ్యక్తి. నామమని తేలింది. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
hope it helps ✔︎✔︎