Telugu chaduvu 10 poems
Answers
ఒక రచనలో రచయిత జీవితం వర్ణితమవుతుందా? రచయిత ఆలోచన తెలుస్తుందా? ఆనాటి సమాజం తెలుస్తుందా? వంటి అనేక ప్రశ్నలు కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘చదువు’ నవల చదివినప్పుడు పాఠకులకు కలుగుతాయి. కె.వి.రమణారెడ్డి ఈ నవలను సంఘ చరిత్రాత్మక నవలగా, ఆత్మ చరిత్ర నవలగా వ్యాఖ్యానించారు. రచయిత ఆత్మకథ గల నవలగా నవీన్ అభిప్రాయపడ్డారు. ఇదే నవలను కాత్యాయని విద్మహే ప్రాతినిథ్య నవల అని పేర్కొన్నారు. టి.జి.ఆర్ ప్రసాద్ తన పరిశోధనలో రచయిత స్వీయ అభిప్రాయాలు ఉన్నాయన్నారు ఇదొక చారిత్రక వాస్తవికత ఉన్న నవలగా కేతు విశ్వనాథరెడ్డి అభిప్రాయ పడ్డారు. ఒక నవలను ఆ రచయిత జీవిత కోణాన్నుండి అవగాహన చేసుకోవటం అవసరమా అనే అనుమానం చదువు నవలను, ఆ నవలపై వచ్చిన విమర్శలను చదివిన వారికి కలుగుతుంది. మరి రచయిత ఈ నవల గురించి ఎక్కడైనా, ఏమైనా అభిప్రాయాన్ని వ్యక్తీకరించారా? అయితే ఆ అభిప్రాయాల్ని విమర్శకుల అభిప్రాయాల్ని తులనాత్మకంగా పరిశీలించటం అవసరం అనిపిస్తుంది.