Telugu essay on any one festival
Answers
Answer:
this is eassy which you asked
మన పండుగ......
తెలుగు పండుగల్లో ముఖ్యమైనది సంక్రాంతి. దీనిని రైతుల పండుగగా అభివర్ణిస్తారు. ఈ పండుగ పంట ఇంటికి వచ్చినందుకు గాను జరుపుతుంటారు.
తెలుగు వారు ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ ఈ పండుగ పిల్లల పండుగ భోగి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, కొత్తబట్టలు ధరించి, బొమ్మల కొలువును ఏర్పాటు చేసి, కొత్త బొమ్మను పెట్టుకుంటారు.
సాయంత్రం వేళ పేరంటాలను పిలిచి ఇంటిలోని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇలా పోయటం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు పిల్లలకి పట్టవు అని నమ్ముతారు.
రెండవ రోజు సంక్రాంతి దీనిని దేవుళ్ళు ఇతరుల పండుగగా భావిస్తారు. ఈ రోజు కొత్త ధాన్యం తో పాయసం వండి నైవేద్యం పెడతారు.
మూడవ రోజు కనుమ ఇది కలగలుపు పండుగ మరియు పశువుల పండుగ. ఈ రోజు పశువులకు పూజలు చేసే పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాక సంక్రాంతి నాడు ఆకాశంలో పతంగులను ఎగురవేస్తారు, కోడిపందాలు కాస్తారు.
సంక్రాంతి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే కొత్తగా పెళ్లయిన దంపతులు అనగా కూతురు అల్లుడుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, కొత్త బట్టలు చదివించి పండుగ జరుపుకుంటూ ఉంటారు.