Psychology, asked by TanayaShere, 1 year ago

telugu essay on mind is not a vessel to be filled but a fire to be kindled

Answers

Answered by kvnmurty
7
     ఇక్కడ మైండ్  అంటే  మనసు  మరియు  మెదడు  అని అనుకోవచ్చు.  రోజూ ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి.  మన ఊళ్ళోనూ, రోడ్డు పైన , ఎక్క ఎక్కడో ఎన్నెన్నో విషయాలు అవుతూ ఉంటాయి.  మనం మన విషయాలు , మనకు కావలసిన విషయాలు పట్టించుకోవాలి.  మిగిలినవి వదిలేయాలి.

    మనము  చదువుకొనే పద్ధతి కూడా ఒకటి ఉన్నది.   వంటింట్లో ఒక పాత్రని అంటే గిన్నెని నింపినట్లుగా మనం మన మెదడు ని విషయాలతో నింప కూడదు.  గిన్నెలని  నింపుతాము, తరవాత వాడుకొంటాము.  తరవాత కడిగి శుభ్రం చేసి మంచి గా  ఉంచుతాము.  ఏ గిన్ని అయినా ఏ ద్రవపదార్ధం తో నైనా నింపుతాము. 

   కానీ, మనం జ్ఞానము  సంపాదించేటపుడు, అంటే విషయాలు నేర్చుకొనేటపుడు , ఇవి అవి , పనికొచ్చేవి చూసుకొని మాత్రమే మనం నేర్చుకోవాలి.  ఏది పడితే అది నేర్చుకొంటే , మన మెదడు లో అక్కరలేనివి  నిండిపోతాయి.  కావలసినవి గుర్తుచేసుకోవడం కష్టం అవుతుంది.  మనం చదువు కొనేటపుడు అన్నీ అర్ధం చేసుకొని గుర్తు పెట్టుకోవాలి.  కానీ బట్టీ కొట్టేసి  ఉత్తినే  మూకు చివర పెట్టుకొని  పరీక్షలకి వెళ్లకూడదు.  పరీక్షలకోసమే ఏదో నాలుగు ముక్కలు బుర్ర లోకి ఎక్కించుకొనే విధం గా చదవ కూడదు.

    మెదడుని, (బుద్ధిని) చాలా విలువ గా చూసుకోవాలి.  ప్రతీ విషయాన్ని  విశ్లేషణ చేసి అర్ధం చేసుకొని దానిలో ఉన్న తర్కాన్ని గుర్తించి  తదనుగుణంగా గుర్తు పెట్టుకోవాలి.  మన బుద్ధి ని  మెదడుని  ఒక ప్రజ్వలించే విధంగా ఆలోచించేటువంటి  విధం గా చేసుకోవాలి.  దీని కోసం  అసలు ఎందుకు ఏ విషయం నేర్చుకొంటున్నాం, ఎలా , ఏమిటి, ఎందుకు, ఎవరు, ఎవరికి, ఏ విధంగా, ఎండు కోసం, ఎవరికోసం, ఇలాంటి ప్రశ్నలు వేసుకొంటే, ఆ తరవాత మనకు ఎలా నేర్చుకోవాలో సులభంగా తెలుస్తుంది.  ఉత్తినే గుర్తు పెట్టేసుకొని అప్పచెప్పేసేటట్లు తరవాత మరచిపోయేటట్లు ఉందా కూడదు.

    మన బుద్ధికి,  మెదడులో ఉన్న సృజనాత్మకమైన ఆలోచనా శక్తి కి  ,  క్రియాశీలమైన మేధా శక్తి కి  పదును పెట్టాలి.  బుద్ధి ఒక చిచ్చుబుడ్డి అయితే, దానిని వెలిగించాలి.  ఆలోచనాశక్తిని రగిలించి  తారా జువ్వ లాగా ఆకాశం లో ఎత్తులకి ఎగిరేటట్టు ఎగర వేయాలి.


kvnmurty: click on thanks button above ;;; select best answer
Similar questions