India Languages, asked by mannikalanah4766, 11 months ago

Telugu essays on games

Answers

Answered by suvodas69
0

Answer:

games are very interesting to play it gives us full on entertainment in our busy life cycle

Answered by UsmanSant
1

క్రీడలు వాటి ప్రాముఖ్యత.......

క్రీడలు మానవులకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడటం ఎంతో అవసరమైనది మరియు మంచిది కూడా. ఎందుకంటే వయసు వ్యత్యాసం లేకుండా క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది అంతేకాక శారీరక వ్యాయామం జరగటం వల్ల మనుషులు చాలా ఆరోగ్యంగా వారి జీవితాన్ని గడపవచ్చు.

ఈ రోజుల్లో ఎన్నో క్రీడలు మనకి తెలిసి ఉంటాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు క్రీడలు ఎంచుకొని సకాలంలో రోజు ఆడటం వలన శారీరక వ్యాయామం మానసికోల్లాసం కలుగుతాయి.

సహజంగా అబ్బాయిల అందరికీ నేటి కాలమాన పరిస్థితుల వల్ల క్రికెట్ పై మక్కువ ఎక్కువ. ఆడవారు టెన్నిస్, షటిల్ వంటి క్రీడలను ఇష్టపడుతున్నారు. క్రీడలు ఆడటానికి వయసుతో పనిలేదు.

చిన్నతనం నుండే క్రీడలు మన జీవితంలో భాగంగా మారాయి కాబట్టి మనం ఎదుగుతూ ఉన్నట్టే వాటిపై అనగా క్రీడల పై మక్కువ పెంచుకొని మన శారీరిక మరియు మానసిక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకోవటం మన బాధ్యత.

అంతేకాక పాఠశాలల్లోనూ క్రీడల కోసం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి, ప్రతిరోజు వారిచే క్రీడలు వ్యాయామం చేయించటం మన ముందు తరానికి ఎంతో అవసరమైన విషయం.

Similar questions