telugu poems of rain in telugu words
Answers
Answered by
6
వానాకాలం జీవితానికి ఉత్సవ సమయమైనట్టు
ఎక్కడెక్కడినుండో పుట్టుకొస్తాయి రకరకాల జీవులు
అప్పటివరకూ
ఏ నేలపొరల్లో లేదా గాలితెరల్లో దాగాయో,
ఆకాశంలో తేలే పలు స్వప్నలోకాల సంచరించాయో కాని
ఆకాశం జలదేహం దాల్చి భూమిని హత్తుకొన్నపుడు
ఆకుపచ్చని మొనలు తెరిచీ,
అప్పుడే విచ్చుకొన్న కళ్ళల్లో ఆకాశాన్ని దాల్చీ,
గాలికి రాగాలు అద్దుతూ భూమ్మీద తెరుస్తాయి మరికొన్ని కొత్త కచేరీలు
నిన్నటివరకూ పొడిగా, శుభ్రంగా ఉన్న నేలపైనా, గోడలపైనా
ఒకటే జీవుల సందడి
ఏమరుపాటున నడిస్తే కాలికింద ఏ ప్రాణం పోతుందోనని
తెల్లని మేఘాల వెంట గాలిపటంలా పరిగెత్తే చూపుల్ని
బలవంతంగా నేలకి లాగుతావు నువ్వు
ఒక చీమలబారో, గొంగళిపురుగో, కప్ప అరుపో
నీ చైతన్యాన్ని తాకిన ప్రతిసారీ
కవీ, నువ్వు ఒంటరివాడివి కావని
జీవితం నీ చెవిలో గుసగుసలాడినట్లనిపిస్తుంది - బివివి ప్రసాద్
Similar questions