telugu poems on valasa kuli
Answers
ఎంత కష్టం ఒచ్చెరా
ఉన్నఊరిలో, తిందమంటే తిండి లేదు,
వర్షం లేక పనిలేదు, వరదోలొచ్చి అన్నీ తుడిచిపోయే
ఏమి చేతువు రా ఓ బడుగు కూనా ఏమి చేతువు రా
చదువుకున్నా ఉద్యోగం కష్టం దొరకడం
పొట్ట పట్టి చేతి సంచిపట్టి ఊరూరాతిరగడం
ఎలాగ పొద్దు గడిచేనురా ఓ పల్లె పోరడా
పట్టణంలో ఇల్లు కడతారు, భవనాలు కడతారు,
బ్రిడ్జ్ కడతారు, రైళ్లు కడతారు
ఇక వలస పోరా నీ ఊరు విడిచి పట్టణం దారి పట్టరా
Answer:poem on valasa kuli
Explanation:కరోనా సమయంలో వలస కార్మికుడిపై కవిత
వాళ్ళు ఇల్లు చేరాలి
కళ్ళల్లో కడపటి ఆశల్ని మొలిపించుకొని
గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని
ముళ్ళ దారుల్ని, మైలురాళ్ళను, మానవనైజాలను
వెక్కిరిస్తూ, ధిక్కరిస్తూ, దిగులు గుట్టల్ని మోసుకెల్తున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
ఆది మానవుడి ఆకలి వేటకాదీ నడక
ఆధునిక అంతరాల కంచెలపై
పావురాల నెత్తుటి పాదముద్రల పాట.
రాత్రీ పగల్ల కాలగతులను కాల్చుకుంటూ వెళుతున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
ఆజ్ఞల గండాలు దాటి అగ్నిపునీతులై
వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరాలి.
కాళ్ళల్లో తిరిగిన పిల్లి పిల్లకు కంకెడు
ముద్దవేసిన కారుణ్య మెటు పాయె
చూరులో పిట్టల కోసం వరి గొలుసులు కట్టిన
మానవత్వమేమై పోయే
కంటి రెప్పలకు తాళాలేసుకున్న
మన ఇంటి గుమ్మాలను దాటుకుంటూ
కదిలి పోతున్న కళే బరాల గుంపు
వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు చేరాలి.
ఇల్లు చేరాక ఏమౌతుంది ?
ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నొకటి సలపరిస్తుంది.
అటునుంచి ఇటు – ఇటు నుంచి అటు
ఆకలి తరిమే వేటలో
నడక ఆగేదెప్పుడు?
ఆకలి లేని లోకానికి సాగిపోతున్న
కొత్త దారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా ?